సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత

“ప్రశ్నించి, పోరాడి, పరిష్కారం సాధిస్తాం

On
సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు):


సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కవిత వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బోడ జనార్దన్ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన సింగరేణి, ఆర్టీసీ కార్మికుల కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు.


“ప్రశ్నించి, పోరాడి, పరిష్కారం సాధిస్తాం”
తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకురావడానికే తెలంగాణ రక్షణ సేన ఏర్పడిందని కవిత పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తామని తెలిపారు. తమ పార్టీ “ప్రశ్నించటం – పోరాటం చేయటం – పరిష్కారం సాధించటం” అనే విధానంతో ముందుకు సాగుతోందన్నారు.
జనం బాట కార్యక్రమంలో ప్రస్తావించిన 25 సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రశ్నించడంతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని, నల్గొండలో 35 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వంతెన పనులు కూడా తమ పోరాటంతో ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు.


కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తోంది
సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని రంగాల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని కవిత ఆరోపించారు. కనీస వేతనాలు నిర్ణయించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాస్తవానికి కార్మికులను మోసం చేసిందన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం ఎ. రేవంత్ రెడ్డి కార్మికులకు రూ.20 వేల కనీస వేతనం ఉండాలని లేఖ రాశారని, ఇప్పుడు సీఎం అయ్యాక అదే వర్గానికి రూ.16 వేలే నిర్ణయించారని విమర్శించారు.
సింగరేణిలో అవినీతి పెరిగిందని, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు.


ఆర్టీసీ విలీనం ఊసే లేదు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కవిత విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్ రాజు గౌడ్ ఆత్మాహుతి చేసుకునే వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేసిన ఓ డ్రైవర్‌ను తొలగించారని, ఉద్యమం తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు.
బోడ జనార్దన్ సహకారంతో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల హక్కుల కోసం మరింత బలంగా పోరాడుతామని తెలిపారు.
“కవిత ఆలోచనలు ఉన్నతమైనవి” – బోడ జనార్దన్
ఈ సందర్భంగా బోడ జనార్దన్ మాట్లాడుతూ మహిళా నాయకురాలిగా కవిత ప్రజా సమస్యల కోసం ముందుకు రావడం ధైర్యసాహసాలకు నిదర్శనమన్నారు. గతంలో ఎన్.టి. రామారావు “కూడు, గూడు, గుడ్డ” నినాదంతో, కె. చంద్రశేఖర్ రావు “నీళ్లు, నిధులు, నియామకాలు” అంశాలతో ప్రజల్లోకి వెళ్లారని గుర్తు చేశారు. అయితే కవిత “పంచజన్యం” పేరిట ఐదు కీలక అంశాలతో మరింత ఉన్నత దృక్పథంతో ముందుకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి మహిళ సీఎం అయితే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని బోడ జనార్దన్ తెలిపారు.

Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 

జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది  - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి  జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు    జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో...
Read More...
Local News 

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు

బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు   జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్  ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్  అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ...
Read More...
Local News 

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో...
Read More...
Local News 

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత

సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు. మంచిర్యాలలో...
Read More...
Crime  State News 

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్ జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు): (చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి...
Read More...
State News 

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత

ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా...
Read More...
State News 

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక

ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి...
Read More...
Local News 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు 

సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు  జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల...
Read More...
Local News 

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన

రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన    జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు) ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”...
Read More...
Local News 

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు

స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల...
Read More...
Local News 

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ

దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు....
Read More...
State News 

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు): జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు. ఒక...
Read More...