సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ

On
సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ

హైదరాబాద్, మే 27 (ప్రజా మంటలు):


రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు విమర్శించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.
సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలులో కనిపించడం లేదని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల కంటే సర్వేలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పెన్షన్ పథకాల అమలులో వృద్ధులు, వితంతులు వంటి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అర్హులైన వారికి సకాలంలో పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ రంగ సమస్యల విషయంలో కూడా ప్రభుత్వం స్పందన చూపడం లేదని, కోతుల బెడద వంటి అంశాలపై బాధ్యతాయుత చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం వృద్ధులను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందని విమర్శించారు. పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని చెప్పి హామీ నిలబెట్టుకోలేదన్నారు. రైతులు ధాన్యం విక్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. రైతులు దళారుల చేతుల్లో పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ పనితీరుపైనా విమర్శలు చేస్తూ రైతుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై లోక రవిచంద్ర మాట్లాడుతూ కేంద్రం తీసుకొస్తున్న జాతీయ నూతన విద్యా విధానం అమలులో స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. మూడు భాషల విధానాన్ని అమలు చేసే విషయంలో అకస్మాత్తుగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులపై అదనపు ఒత్తిడి పెంచుతాయని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇంటర్ బోర్డు రద్దు అంశంపై సీఎం చేసిన ప్రకటనలు విద్యా వ్యవస్థలో అనిశ్చితిని పెంచాయని విమర్శించారు. ఒకవైపు రద్దు ప్రకటనలు, మరోవైపు అడ్మిషన్ల నోటిఫికేషన్లు రావడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. సుమారు 13 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కాలేజీలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, విద్యా రంగంలో స్పష్టమైన విధానాలు అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నేతలు హెచ్చరించారు.

Join WhatsApp

More News...

State News 

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ హైదరాబాద్, మే 27 (ప్రజా మంటలు): రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు విమర్శించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర ప్రభుత్వ పనితీరుపై...
Read More...
State News 

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సమావేశంలో ధర్మ...
Read More...
Local News 

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు  ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల మే 25(ప్రజా మంటలు)  జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్...
Read More...
Local News 

శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం

శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం జగిత్యాల మే 24 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో గత వారం రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర శర్మ చే అంగ రంగ వైభవంగా జరిగిన శ్రీ మహా విష్ణు పురాణం  ప్రవచనం సమాప్తి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణుల...
Read More...
Local News 

చదువుతోనే చక్కటి జీవితం  జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ 

చదువుతోనే చక్కటి జీవితం  జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్  జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)చదువుతోనే సమాజంలో గుర్తింపు,  చక్కటి  జీవితం లభిస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో జరిగిన గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోప) జగిత్యాల జిల్లా కమిటీ నిర్వహించిన ప్రతిభ పురస్కారాల అవార్డ్స్ మహోత్సవంలో ఆయన ముఖ్య...
Read More...
Local News 

భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత

భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత   జగిత్యాల మే  24 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఖండవల్లి ఆదిత్య శర్మచే శ్రీమద్ భాగవత సప్తాహం కొనసాగుతుండగా ఆదివారం ఉదయము కీ"శే " సరాబు మందిరం వెంకటేశ్వర శర్మచే తెలుగులో అనువదించబడిన భాగవత సప్తాహ చూర్ణిక పుస్తకాలను వెంకటేశ్వర శర్మ కుమారుడు భారవిశర్మ పురాణ ప్రవచకులు ఆదిత్య శర్మకు అందజేశారు. ...
Read More...
Local News 

ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం

ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం జగిత్యాల మే 23(ప్రజా మంటలు)  జిల్లా కేoద్రం కృష్ణా నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో, ప్రముఖ పౌరాణిక, వేద, పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు, బహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే, ఎంతో వైభవంగా ,జరుగుతున్న విష్ణు పురాణం శనివారం 6వ రోజు కు చేరింది. సామూహిక శ్రీ విష్ణు     స హస్ర...
Read More...
Local News 

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ జగిత్యాల మే 23(ప్రజా మంటలు)జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన “99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ముగింపు కార్యక్రమం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
Local News  State News 

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026 (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :  తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు మరియు హైలైట్స్.  1. రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి...
Read More...
Local News  Crime 

గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు 

గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు  గొల్లపల్లి మే 22 (ప్రజా  మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి  ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి  ఆధ్వర్యంలో  ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక...
Read More...
Local News 

ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం

ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం   జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో పండిత శిరోమణి బ్రహ్మశ్రీ ఖండవల్లి ఆదిత్య శర్మ చే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము గురువారం ప్రారంభమైంది. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3_30 నుండి 6_30 వరకు కొనసాగుచున్నది. ఈనెల 27వ...
Read More...
Local News  Crime 

ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్  సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు 

ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్  సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు  గొల్లపల్లి మే 21 (ప్రజా  మంటలు) జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో  ఎస్సై  మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా...
Read More...