మాదకద్రవ్యాల వినియోగం ద్వారా హింస ,అనారోగ్యం, నైతిక విలువల పతనం
జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా గురువారం పొలాస వ్యవసాయ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని విద్యార్థి దశ నుండే మన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలని అలాంటి ఆలోచన వల్లే మనం జీవితంలో అనుకున్నా స్థాయిలో రాణించగలుగుతామని అన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో యువత పోటీ తత్వంతో ఉండాలని నేటి యువత పైన దేశ అభివృద్ధి ఆధారపడి వుంటుందని అన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని వాటికి బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించి న సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.
అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు.
అవగాహన సమావేశం అనంతరం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న యువతను జాగృతం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఎస్పి విద్యార్థులతో కలిసి తిలకించారు.
కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమ కో ఆర్డినేటర్, కళాశాల ఎన్ సి సి లెఫ్టినెంట్ అధికారి, డీ-అడిక్ట్ ట్రైనర్ పర్లపల్లి రాజు, సి సి ఎస్ సి.ఐ శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్ ఐ సదాకర్, కళాశాల ఎన్ఎస్ ఎస్ అధికారి ఎల్లాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)