అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరం రాజేశ్వరి అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ చోరీ కాదని 140 కోట్ల ప్రజల హృదయాన్ని చూరగున్నారని ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుర్తుకొస్తాయని బిజెపి రాష్ట్ర నాయకులు మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని ప్రజాస్వామ్యం,రాజ్యాంగం ప్రమాదంలో పడిందని మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయని హిందీ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం వలన ప్రాంతీయ భాషలు ప్రమాదంలో పడ్డాయని దుష్ప్రచారం చేసి ఇప్పుడు కొత్తగా మీ ఓటు ప్రమాదంలో పడిందని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం కలిసి మీ ఓటును దొంగిలిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని కానీ ఇవన్నీ ఏవీ ప్రమాదంలో పడలేదని ప్రమాదంలో పడింది 65సంవత్సరాలు దేశాన్ని పాలించిన నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రమాదంలో పడబోతుందని తెలుసుకొని దేశప్రజల దృష్టిని మరల్చడానికి ఓటు చోరీ అంటూ రోడ్లపై తిరుగుతిన్నారని పేర్కొన్నారు.
స్వాతంత్రానంతరం నెహ్రూ కాలం నుండి అసలైన ఓటు చోరీ కి పాల్పడింది నెహ్రూ కుటుంబ సభ్యులేనని విమర్శించారు.1947 సంవత్సరంలో మొదటి సారిగా ప్రధానమంత్రి ఎన్నికకు రాజ్యాంగ పరిషత్ లోని 15 ఓట్లకుగాను 12ఓట్లు సాధించిన సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి కాకుండా ఒక్క ఓటు వచ్చిన నెహ్రూ ప్రధాన మంత్రి అయి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు. తర్వాత అడ్డదారిలో గెలిచిన ఇందిరాగాంధీ నియామకం చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే తీర్పును కాలరాసి అత్యవసర పరిస్థితి ప్రకటించి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు.
1968లో సోనియా వివాహం జరిగితే 16 సంవత్సరాల వరకు భారత పౌరసత్వం తీసుకోలేదని కాని 1983లో జరిగిన ఎన్నికల్లో సోనియా ఓటు వేసి ఓటు చోరికి పాల్పడిందని పీవీ నరసింహ రావు ప్రధాన మంత్రి అయ్యక జరిగిన బల ప్రదర్శనలో పార్లమెంటు సాక్షిగా ఎంపీలను కొనుగోలు చేసి డబ్బుల సూటుకేసులు మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఓటు చోరికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 100నియోజకవర్గాల్లో ఓటు చోరీ జరిగింది అని చేస్తున్న ప్రచారం అది నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన 99 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు హైద్రాబాద్ నుండి గెలిచిన అసదుద్దీన్ నియోజవర్గాల్లో మరియు కర్ణాటకలోని నంజెగౌడ ఎన్నిక చెల్లనేరదు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి పాల్పడినట్లు రాహుల్ గాంధీ ఒప్పుకోవాలని అన్నారు. బిజెపి ఓటు చోరికి పాల్పడేది అయితే వాజపేయి గారు ఒక్క ఓటు తేడాతో ప్రధాన మంత్రి పీఠాన్ని వదులుకునే వారు కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని ధర్మ సత్రంగా మార్చి పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి వచ్చిన రోహింగ్యాలకు అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకుగా మార్చుకుందని ఆరోపించారు.
ఆపరేషన్ సింధూర్ ను పాక్ విదేశాంగ మంత్రి ఒప్పుకున్న రాహుల్ ఒప్పుకోలేదని ఇప్పుడు నేపాల్ లో జరిగిన సంఘటన భారత్ లో జరిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించడం శత్రుదేశాలకు మద్దతు తెలిపే విధంగా ఉన్నాయని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి నాయకులకు గ్యారంటీ వారంటీ అయిపోయిందని అందుకే మతిబ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
---
-
More News...
<%- node_title %>
<%- node_title %>
రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 08 (ప్రజామంటలు): :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ... పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం
రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర
వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
*కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా
సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు.... జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్
**
జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు) భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ... స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్ * ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సి.ఐ సుధాకర్ మాట్లాడుతూ.... ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం
జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు.
సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి... అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్
కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్‌ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం... తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు.
సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3... వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి... మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత
ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,”
తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్‌పల్లి ప్రెస్ మీట్
కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
మేడ్చల్–మల్కాజ్‌గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన... “ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్
“స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు”
హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు):
ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల... న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్
మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు.
సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన... 