మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం - "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్
మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం
- "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"
వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్
హైదరాబాద్ జనవరి 28:
రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను బెషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనల వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు, "తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్" మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఇటీవల "పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ" (రెడ్ కో) కార్యకలాపాలపై హైదరాబాదులో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
తెలంగాణలోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకుల తో కూడిన ప్రతినిధుల బృందం ఆదివారం నాడు ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పిట్టల రవీందర్ మాట్లాడుతూ గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక మరియు పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని గుర్తుకు చేశారు.
ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియోగించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు శ్రీ పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 159 రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని, ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని, రిజర్వాయర్లలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండటం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని, ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతులపైన, ఆదాయ వనరులపైన, సామాజిక భద్రతపైన ప్రతికూల ప్రభావాలను తీవ్రస్థాయిలో చూపిస్తాయని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన మరియు ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరమని శ్రీ పిట్టల రవీందర్ ఆక్షేపించారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అనేక దేశాలలో నీటిపై తేలే ఆడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదులుగా జలాశయాలకు అనుబంధంగా నిర్మించిన ప్రధాన కాలువల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిల కలుపుతున్నారని ఈ టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాలలో విజయవంతం అయ్యిందని ఇదే పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుసరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలోని రిజర్వాయర్లకు అనుబంధంగా సుమారు 30 వేల కిలోమీటర్ల పొడవు కలిగిన పంట కాలువలు ప్రధానా నీటి కాలువలు అందుబాటులో ఉన్నాయని, ఈ కాలువలను వినియోగించుకోవడం ద్వారా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ పిట్టల రవీందర్ సూచించారు. అందువల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపల పెంపకం మీద ఆధారపడిన లక్షలాదిమంది మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
"తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విట్టల రవీందర్ తో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాల కనకయ్య ముదిరాజ్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దెడ గణేష్ ముదిరాజ్, మేడమైన కనకయ్య ముదిరాజ్, లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్, ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర, తదితరులు కూడా హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం
కరీంనగర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రభుత్వం ముందుగా 20వ తేదీన నూతనంగా ఏర్పడిన గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారానికి నిర్ణయించగా ఆ ముహూర్తం బాగాలేదని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్యులు ప్రభుత్వానికి ,ప్రభుత్వ పెద్దలకు సూచించడంతో వారు ఆ సూచనలను పరిగణనలోకి తీసుకొని 22వ తేదీ... జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర
హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జిమ్మీ లాయ్కు కోర్టు దోషిగా తీర్పు ఇవ్వడం ఒక వ్యక్తిపై జరిగిన న్యాయ చర్యగా మాత్రమే చూడటం చరిత్రను చిన్నచూపు చేయడమే. ఇది హాంకాంగ్లో భిన్నాభిప్రాయాలకు, స్వతంత్ర మీడియాకు, ప్రజాస్వామ్య రాజకీయాలకు వేసిన చివరి ముద్రగా భావించాల్సిన ఘట్టం.
78 ఏళ్ల జిమ్మీ లాయ్... జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్
జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ శాతం 79.64గా నమోదైంది. మొత్తం 1,71,920 ఓట్లకు గానూ 1,36,917 ఓట్లు పోలయ్యాయి.
బుధవారం బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు... జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, 1వ వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరైన... పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్
సికింద్రాబాద్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్కు నుండి సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఉన్న 26 ఫుట్ పాత్ వ్యాపారస్తులకు జిహెచ్ఎంసి అధికారులు బుధవారం మార్కింగ్ వేశారు. ఇకపై తమ పరిధిని దాటి ముందుకు రాకూడదని వారు ఫుట్ పాత్ దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని... పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్ భవన్ లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభోత్సవం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణ ఫంక్షన్ హాల్ లో... మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)
జిల్లాలో 3వ దశ పోలింగ్లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్... ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా... కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు
జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా... లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు.
మెట్టుపల్లి డిసెంబర్ 17 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్టుపల్లి లో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 రోజున నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో
క్రిమినల్... ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజామంటలు) :
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును పీసీసీ వైస్ప్రెసిడెంట్, సనత్నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ ఆలోచనలు, విలువల... 