మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం - "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"   వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

On
మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం -

మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం
- "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"  
వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

హైదరాబాద్ జనవరి 28:
రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను బెషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనల వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు, "తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్" మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఇటీవల "పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ" (రెడ్ కో) కార్యకలాపాలపై హైదరాబాదులో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
తెలంగాణలోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకుల తో కూడిన ప్రతినిధుల బృందం ఆదివారం నాడు ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పిట్టల రవీందర్ మాట్లాడుతూ గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక మరియు పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని గుర్తుకు చేశారు.

ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియోగించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు శ్రీ పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 159 రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని, ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని, రిజర్వాయర్లలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండటం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని, ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతులపైన, ఆదాయ వనరులపైన, సామాజిక భద్రతపైన ప్రతికూల ప్రభావాలను తీవ్రస్థాయిలో చూపిస్తాయని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన మరియు ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరమని శ్రీ పిట్టల రవీందర్ ఆక్షేపించారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అనేక దేశాలలో నీటిపై తేలే ఆడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదులుగా జలాశయాలకు అనుబంధంగా నిర్మించిన ప్రధాన కాలువల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిల కలుపుతున్నారని ఈ టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాలలో విజయవంతం అయ్యిందని ఇదే పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుసరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలోని రిజర్వాయర్లకు అనుబంధంగా సుమారు 30 వేల కిలోమీటర్ల పొడవు కలిగిన పంట కాలువలు ప్రధానా నీటి కాలువలు అందుబాటులో ఉన్నాయని, ఈ కాలువలను వినియోగించుకోవడం ద్వారా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ పిట్టల రవీందర్ సూచించారు. అందువల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపల పెంపకం మీద ఆధారపడిన లక్షలాదిమంది మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
"తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విట్టల రవీందర్ తో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాల కనకయ్య ముదిరాజ్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దెడ గణేష్  ముదిరాజ్, మేడమైన కనకయ్య ముదిరాజ్, లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్, ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర, తదితరులు కూడా హాజరయ్యారు.

Tags

More News...

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న  విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా హైదరాబాద్ ఏప్రిల్ 02: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక...
Read More...

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు జగిత్యాల మే 02 (ప్రజా మంటలు) శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం, నిర్వహించి స్వామి వార్ల జీవిత విశేషాలను...
Read More...
Local News 

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, మే 02  (ప్రజామంటలు): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  రికగ్నైజ్ గుర్తింపు కలిగిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కాశపాగా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి కార్మికులకు వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు, అన్యాయం జరిగిన అ సమస్యకు పరిష్కార దిశగా న్యాయబద్ధ పోరాటం చేసి బాధితులకు...
Read More...
Local News 

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లు పంపిణీ సికింద్రాబాద్, మే 02 (ప్రజామంటలు): వాసవిక్లబ్ ప్రతినిధి బి.లక్ష్మీ వివేకానంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొండాపూర్ లోని ఆదిత్యా హైట్స్ వద్ద ఉన్న చలివేంద్రంలో వందలాది మందికి మజ్జిగ ను పంపిణీ చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్ మ్యాడం చంద్రశేఖర్, ప్రతినిధులు విద్యా సంకల్స్ గోలి జగదీశ్వర్, ఆదిత్యా...
Read More...
State News  Spiritual  

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు(రామ కిష్టయ్య సంగన భట్ల...        9440595494) "భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర" అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో... భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా...
Read More...
State News 

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్ గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల ఎస్ఐ సిహెచ్ ,సతీష్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారానికి సత్వర న్యాయం చేయడం నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు మండలంలో శాంతిభద్రతలను నిలకడగా ఉండడంతో ప్రశంసిస్తూ...
Read More...
Local News 

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ  

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ   సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు): వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జియాగూడ లోని గోశాలో గోసేవ, గోపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బి.లక్ష్మీ వివేకానంద్ స్పాన్సర్ చేయగా వాసవి క్లబ్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈసందర్బంగా గోవులకు ఒక ట్రక్కు పచ్చగడ్డి ని గోశాలకు అందచేశారు. గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్...
Read More...
Local News 

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల రాఘవ పట్నం గ్రామానికి చెందిన ఏలేటి చుక్కా రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి కార్యకర్త. రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులు అయిన వెంటనే స్పందించి  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  ఆయనకు సంబంధించిన ఎఫ్ ఐఆర్ కాపీలు  పోస్టుమార్టం రిపోర్టులను...
Read More...
Local News 

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్  గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాలీబాల్ శిక్షణ కేంద్రం శుక్రవారం ఉదయం ప్రారంబిచారు. కోచ్ తాండ్ర పవన్ మాట్లాడుతూ...
Read More...
Local News 

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  అభినందనలు

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  అభినందనలు                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 2(ప్రజా మంటలు)  జిల్లా 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి ( s s c) పరీక్ష ఫలితాల్లో  తెలంగాణ రాష్ట్రంలో 4 వ స్థానం  సాధించిన జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపి నందుకు  జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన...
Read More...
Local News 

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం 

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 2 ( ప్రజా మంటలు)  స్థానిక విద్యానగర్లోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో ఆది శంకరాచార్య జయంతి, మరియు రామానుజాచార్య జయంతిని, పురస్కరించుకొని, ప్రముఖ  ఆధ్యాత్మిక సేవా తత్పరత కలిగిన  పొట్లపల్లి జమున గారు వికాస తరంగిణి మహిళలచే, ఒక వంద ఎనిమిది మంది సభ్యులచే సామూహిక శ్రీ విష్ణు...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే2(ప్రజా మంటలు)జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (మే 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు,...
Read More...