పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు
జగిత్యాల ఏప్రిల్ 3(ప్రజా మంటలు)
తేదీ 14-06-2024 రోజున బీర్పూర్ గ్రామ శివారులో రోళ్ల వాగు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి చంపినారని, అప్పటి బీర్పూర్ పంచాయితీ కార్యదర్శి పుర్రే చిన్న నర్సయ్య బీర్పూర్ పోలీసు స్టేషన్ లో ధరకాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తులో భాగంగా, మొదట అనుమానంతో మృతుడి యొక్క కుటుంబ సభ్యులయిన చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణకు మృతదేహాన్ని చూపించినా కానీ వారు ఆ శవం అతనిది కాదని ఒక అనాధ శవంలాగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మృతుడి యొక్క ఎముక భాగాలను డి ఎన్ ఏ పరీక్ష నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్, హైదరాబాద్ కు పంపి, చనిపోయిన వ్యక్తి అంకం లక్ష్మీనారాయణ, తండ్రి పేరు రాజం, 55 సంవత్సరాలు, నర్సింహులపల్లి గ్రామం గా గుర్తించి, ఈ విషయం నిందితులకు తెలియచేసినా కానీ వారిలో ఎలాంటి భాద లేకపోవడం మరియు మృతుడికి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించాల్సిన కర్మ కాండలు జరిపించలేదు.
, మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ప్రవర్తన మీద అనుమానం ఉండటం తో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మొదట వారు నేరం అంగీకరించలేదు.
ఇట్టి వారికి ఎఫ్‌ఎస్‌ఎల్, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఆధునాతన సాంకేతిక పరిజ్ణానం పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్ట్ కు మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ను పంపి ఆ టెస్ట్ ఫలితాల ద్వారా అంకం లక్ష్మినారాయణను హత్య చేసింది వారేనని నిర్ధారించుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితులు అంకం సాయికుమార్ తన తండ్రి అంకం లక్ష్మీనారాయణ రోజూ తాగి వచ్చి, ఏ పని లేకుండా గొడవ చేస్తున్నాడని ఉద్దేశంతో, మృతుడి యొక్క కొడుకు మరియు తన భార్య ఇద్దరు కలిసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చినారని నేరం ఒప్పుకోగా వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు.
ఈకేసును ధర్యాప్తు అధికారి పరిశోధించిన జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వై కృష్ణారెడ్డి ని జగిత్యాల డిఎస్‌పి రఘుచందర్ అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు
