ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్
ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి.-ఎస్పీ
ఇబ్రహీంపట్నం మార్చ్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాల ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీఅశోక్ కుమార్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు.
కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు.
ఎస్పీ వెంట ఎస్.ఐ అనిల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం
కరీంనగర్, జనవరి 30 (ప్రజా మంటలు):
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలా మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ మాట్లాడారు.
వీణవంకలో... మారేడు ఆకుపై అమ్మవార్లు…
జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన చిత్రకారుడు, కళాశ్రీ గుండేటి రాజు తన ప్రత్యేక కళా నైపుణ్యంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు. పవిత్రమైన మారేడు ఆకుపై సమ్మక్క–సారక్క అమ్మవార్ల ప్రతిమలను తన కుంచెతో అద్భుతంగా చిత్రీకరించి భక్తుల మనసులు గెలుచుకున్నారు.
శుక్రవారం సమ్మక్క–సారక్క ఇద్దరూ గద్దెపై కొలువుదీరిన సందర్భంగా, అపారమైన భక్తితో... తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు
హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు):
రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని... భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని సంఖ్యలతో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచార వాదనలకు భిన్నంగా, ఈ సర్వే భారత ఆర్థిక నిర్మాణంలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తోంది.
ఎగుమతులు–దిగుమతులు: అసమతుల్యత స్పష్టం
ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం, భారత... ఎన్నికల లబ్ది కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత
హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు):
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత బాధాకరమైన అంశంపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా లేదని అన్నారు.... ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం
హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు.
ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్‌కు చేరింది. డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన ఆయన మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి వచ్చింది.
కుటుంబం... ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు
హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
నోటీసుల్లో భాగంగా,... జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు
కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.
బిసి కాలం తొలగించడం అన్యాయం
పదేళ్లకు ఒకసారి జరగాల్సిన... ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే... మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు):
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా... 