వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన
ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ ఆచార్యత్వంలో మద్యాహ్నం 3 గంటలకు ముందుగా వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో దేవస్థానం ముందు భాగాన, సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంచిన మూడు రథాలపై శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర స్వాములను ఆసీనుల గావించి బలిహరణం, అష్టదిక్పాలకుల పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పరచిన క్యూలైన్ల ద్వారా అశేష భక్తులు, రథాలపైకి నిచ్చెనల ద్వారా వెళ్ళి రథా రూఢులైన స్థానిక దైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదమంత్ర ఘోషలు, మంగళ వాద్యాలు, జయజయ ధ్వనాల మధ్య దేవ స్థానంనుండి ఇసుకస్థంభం మీదుగా పురపాలక సంఘ కూడలి వద్ద గల నంది విగ్రహం వరకు నారసింహ, వేంకటేశ్వర, రామలింగేశ్వర రథాలను వరుసగా నిలిపి భక్తజనం అనుసరించగా, రథాలను ఊరేగించగా ముత్తయిదువులు రోడుకిరు వైపులా నిలిచి మంగళ హారతులు పట్టారు.
స్థానిక ప్రముఖులతో కలిసి రథారూడు లయిన స్వామి దర్శనం చేసుకొని కంకణాలు కట్టు కున్నారు. సిఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్, అసిస్టెంట్ శ్రీనివాస్ రథాల ముందుండిమార్గ నిర్దేశనం చేయగా నంది విగ్రహ కూడలి వద్దకు అశేష భక్త జనం తోడురాగా వూరేగి తిరిగి వచ్చారు.
అనంతరం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలొనరించి గోదావరికి ఊరేగింపుగా వెళ్ళి చక్రతీర్ధ మంగళ స్నానాలు ఆచరించారు. చక్రతీర్ధం అనంతరం రాత్రి మధ్వా చారి రాం కిషన్ గృహంలో
విందు భోజనం ఆరగించి, తిరిగి దేవస్థానానికి చేరుకున్నారు. ధర్మపురి సి ఐ
రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్, అధిక సంఖ్యలో పోలీసులు, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
