జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం
జగిత్యాల మార్చి 18(ప్రజా మంటలు)
జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జిల్లా కలెక్టర్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధ్యక్షులు సత్య ప్రసాద్ ని మరియు అదనపు కలెక్టరు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఉపాధ్యక్షులు బి ఎస్.లత ని మర్యాద పూర్వకంగా కలిశారు .
నూతనంగా ఎన్నికైన కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా లోని విద్యార్థులలో జాతీయ భావాలను , సామాజిక స్పృహను, సృజనాత్మకతను మంచి స్కౌట్ శిక్షణ ద్వారా పెంపొందించాలని, మన జిల్లా పిల్లలు జాతియ స్థాయి కి ఎదగాలని కోరుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ బీఎస్ లత తెలియజేశారు.
. ఈ కార్యక్రమంలో జిల్లా భారత్ స్కౌట్స్ కమిషనర్ బియ్యాల హరి చరణ్ రావు, సెక్రటరి కొలగాని మధుసూదన్, జాయింట్ సెక్రెటరీ వుజగిరి జమున రాణి, ట్రైనింగ్ కమిషనర్ చంద నాగరాజు, కబ్స్ కమిషనర్ దొమ్మాటి వినోద్ గౌడ్ , స్కౌట్స్ మాస్టర్ మ్యాడం భూమారెడ్డి, చుక్క కిరణ్ కుమార్ పాల్గోన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతీశాఖ వలలో నలుగురు ఉద్యోగులు
భూపాలపల్లి/మంథని ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసుల్లో పట్టుకున్నారు.
భూపాలపల్లి జిల్లా కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్‌తో పాటు కోర్టు... కందేనకుంట కుల బహిష్కరణ ప్రచారం అవాస్తవం – సామాజిక సమరసత వేదిక నివేదిక
జగిత్యాల, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):బీరుపూర్ మండలం కందేనకుంట గ్రామంలో కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని సామాజిక సమరసత వేదిక (ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ) నిజ నిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. సంఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు వేదిక సభ్యులు గ్రామాన్ని సందర్శించి... ఆర్డీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ
జగిత్యాల ఫిబ్రవరి 20(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో జగిత్యాల ఆర్డీవో కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను రైతులకు త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ... అమీర్ పేట మైత్రీవనం చౌరస్తాలో అగ్ని ప్రమాదం – 60 మంది విద్యార్థులు సురక్షితం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
నగరంలోని హైదరాబాద్ అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
కోచింగ్ సెంటర్లో మంటలు
ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు... ట్యాంక్ బండ్ పై ఫూలే విగ్రహ పనుల పరిశీలించిన కవిత–
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
ట్యాంక్ బండ్‌పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు.
అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి
రెండున్నరేళ్లుగా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి... డీఎండీకే – డీఎంకే కూటమి: రాజకీయ లెక్కలు ఏమిటి?
చెన్నై ఫిబ్రవరి 20:
తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది.డీఎండీకే అధికార పార్టీ అయిన డీఎంకే కూటమిలో చేరింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వరకు డీఎండీకే ఏ కూటమిలో చేరుతుందో స్పష్టత లేకుండా ఉంది. అధికార పార్టీ వైపు వెళ్తుందా? లేక ప్రతిపక్ష కూటమిలో చేరుతుందా? అనే సందేహాలు... నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
చెన్నై, ఫిబ్రవరి 19:
నీట్–ఎస్ఎస్ 2024–25 ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువడింది. కౌన్సెలింగ్‌కు నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత ఖాళీ సీట్లు ఉన్నాయనే కారణంతో అదనపు మాప్-అప్ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం... రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై జాతీయ నేతలతో చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తెలంగాణ అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ప్రతినిధి బృందం మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలను కలిసి తెలంగాణ... బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)::
బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని పేర్కొన్న అర్వింద్, దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత... నూతన కౌన్సిలర్లను సత్కరించిన మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు
మెట్పల్లి, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన నూతన కౌన్సిలర్లను మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మార్గదర్శకత్వంలో, కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్... మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లకు బీసీ సంఘం వారిచే ఘనంగా సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ లను బీసీ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోగురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి ముసి పట్ల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, బిసిల సమస్యలపై దృష్టిసారించి చేతి వృత్తుల వారికి ఉపాధి... హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.
SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర... 