మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు
* కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...
* బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి...
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పేరిట తెలంగాణా రాష్టంలోని మహిళలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఎంతమందికి 2,500/- చొప్పున ఇచ్చారో 500/-రూపాయలకే ఎంతమందికి సిలిండర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వందేళ్ల తర్వాత కులగణన చేశామని అది తమ గొప్ప అని చెప్పిన మంత్రి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరవై ఏండ్లు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఏఒక్క లబ్ధిదారునికి బిల్లులు ఇచినట్టు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఎన్నికల సందర్బంలో మహిళా సంఘాలకు ఇచ్చిన అయిదు లక్షలు రుణమాఫీ చేసి వడ్డీలేని ఋణం పది లక్షలు ఇస్తామని మహిళా సంఘాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
బీజేపీ పార్టీ ఎప్పుడు కుల,మత రాజకీయాలు చేయలేదని కుల, మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అందుకే దసరా పండుగకి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చీరల పంపిణి నిలిపివేసిందని కానీ క్రిస్మస్, రంజాన్ పండుగలకు క్రిస్టియన్లకు ముస్లింలకు మాత్రం గిఫ్టులు ఇచ్చిందన్నారు.
మహిళా సంఘాలకు ఏడు బస్సులిచ్చి ఎడాపెడా ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలు మాచేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడు అన్న మాటలకు నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి ఏమి చేయకున్నా అన్ని చేసినట్లు పొగడడం మహిళా సమాజానికి సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ త్యాగాల పార్టీ కాదని వాళ్ళ భోగాల కోసం వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేసి మూడు ముక్కలు చేసిందన్నారు. వారు చేసిన పాపం వల్లనే భారతదేశం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
