కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
సిండికేట్‌కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
-సిండికేట్‌కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
హైదరాబాద్ జనవరి 24:
కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.
గంజాయి తర్వాత ఇదే..
రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్‌గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్కావటమే.
ఎక్కువ మత్తు కోసం..
కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్ఏబీ చీఫ్ సందీప్‌శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్ఏబీ అధికారులు హైదరాబాద్‌లో దాడులు జరపగా 66 కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.
ముంబయి నుంచి ఎక్కువగా..
రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్‌కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
సిండికేట్‌కు పొలిటికల్ అండ..
ఈ కల్తీ కల్లు సిండికేట్‌కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.
(వివిధ సమాచార మాధ్యమాల ఆధారంగా)
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు.
మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు... నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు
మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఐక్యతతో ముందుకు... పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి. -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం 2024... హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్
కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు):
కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి... అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రజల సంతృప్తి_ గ్రామపంచాయతీ ఎన్నికల తీర్పు నిదర్శనం
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు... భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా కీలక తీర్పును వెలువరించిన . జిల్లా సెషన్స్ జడ్జి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్‌ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తాత్కాలికంగా రద్దు
న్యూఢిల్లీ డిసెంబర్ 19| (ప్రజా మంటలు):
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ముందే అవార్డు జాబితా ఒక ఆంగ్ల పత్రికకు లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గురువారం(18 డిసెంబర్ ),మధ్యాహ్నం జరగాల్సిన సాహిత్య అకాడమీ మీడియా సమావేశాన్ని... ఆర్యుపిపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రాజేంద్రప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (|ప్రజా మంటలు):
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్‌యుపిపిటీఎస్) ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శానమోని నర్సిములు, రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి సత్తిరాజు శశికుమార్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అల్లకట్టు సత్యనారాయణను... అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరణపై టీజీహెచ్ఆర్సీ సీరియస్
హైదరాబాద్ డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యా కార్యాలయాల్లో (MEO కార్యాలయాలు) మెసెంజర్లు (ఆఫీస్ సబార్డినేట్లు)గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం నిరాకరించడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన జరిగిన విచారణలో, 20 సంవత్సరాలకు పైగా... 