దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక
దేవస్థానంలో వేద పారాయణాలు
నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ మహారణ్యం మురళీధర స్వామి (చెన్నై) వారల దివ్యాశీస్సుల తో జనవరి 18నుండి 24 వరకు సప్తాహ్నిక దీక్షా
పూర్వకముగా సంపూర్ణ ఋగ్వేద హవనం, సంపూర్ణ సామవేద పారాయణం, విశేషించి, సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులను వేద విధులు సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు.
నిరంతర వేద ఘోషతో, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి క్షేత్రంలో చతుర్వేద పారాయణ సంస్కారాలతో అనాదిగా యజ్ఞ యాగాదులు నిర్వహించ బడిన నేపథ్యం ఉంది.
ధర్మపురి క్షేత్రంలో దశాబ్దాల తర్వాత
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా వుండాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యములో ప్రజలందరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో, స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ, హైదరాబాద్ వారి 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణము నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ, అధ్వర్యములో స్థానిక వేదబ్రాహ్మణుల సహాకారముతో వారం రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో పారాయణాలు, హోమాలు నిర్వహించారు. విఖ్యాత వేద పండితులు
గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ నేతృత్వంలో అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ,
దహగాం అరుణ్ కుమార్ శర్మ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులో, సూర్య నారాయణ శర్మ ఘపపాఠీ నేతృత్వంలో జూనూతుల త్రివేది శర్మ ఘపపాఠీ, నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ,
తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ ఋగ్వేద పారాయణాలు, ముత్యాల శర్మ సామవేదం గావించారు.
ప్రముఖుల భాగస్వామ్యం
అపురూప వేద పారాయణ, హోమాల పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలలో బుధవారం పరమహంస పరివ్రాజకాచార్య ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్యులు, రమణ, నరసింహ మూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న, మాజీ దేవస్థాన చైర్మెన్ శ్రీ ఎస్. దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బెంగళూరులో విషాదం: కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య
బెంగళూరు జనవరి 30 (ప్రజా మంటలు):
వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాన్ఫిడెంట్ గ్రూప్ యజమాని, చైర్మన్ అయిన సీజే రాయ్ (57) శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ప్రాంతంలోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా... ఫోన్‌ట్యాపింగ్ కేసు: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
హైదరాబాద్ జనవరి 30 (ప్రజా మంటలు):
ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణకు అనుమతి ఇవ్వలేమని సిట్ స్పష్టం చేసింది. తమ రికార్డుల్లో... ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి: రాంచందర్ రావు
▶ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణ▶ జగిత్యాలలో ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి: అరవింద్▶ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది.
జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ శంఖారావం... అందుబాటులో ఉండనున్న జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు
జగిత్యాల జనవరి 30 ( ప్రజా మంటలు) రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ఖర్టాడే కాళీచరణ్ సుదామ రావు జగిత్యాల జిల్లాకు నియమించబడగా జగిత్యాల లోని అతిథి గృహంలో సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు
ప్రజలు,... మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల/ కోరుట్ల/ మెట్పల్లి జనవరి 30 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు... ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల జనవరి 30 (ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరము లో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్, బి. సత్యప్రసాద్, ఆదేశాల క్రమము జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.
యు ఐ డి ఏ ఐ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని ఎవరైనా... సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత
మేడారం, జనవరి 30 (ప్రజా మంటలు):
సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు.
కాకతీయుల వంటి రాజులతో పోరాడిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు తమ జాతి కోసం నిలబడి పోరాడిన వీరవనితలని అన్నారు. గోవిందరాజు, పడిగిద్దరాజు వంశానికి చెందిన గొప్ప... అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి
గొల్లపల్లి, జనవరి 30 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్టార్ బిర్యాణి సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఘటన వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు.
గతంలో కూడా యాజమానికి చెందిన టెంట్ సామగ్రి అగ్ని ప్రమాదంలో నష్టపోయిందని, ఇప్పుడు బిర్యాణి సెంటర్... ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం
కరీంనగర్, జనవరి 30 (ప్రజా మంటలు):
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలా మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ మాట్లాడారు.
వీణవంకలో... మారేడు ఆకుపై అమ్మవార్లు…
జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన చిత్రకారుడు, కళాశ్రీ గుండేటి రాజు తన ప్రత్యేక కళా నైపుణ్యంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు. పవిత్రమైన మారేడు ఆకుపై సమ్మక్క–సారక్క అమ్మవార్ల ప్రతిమలను తన కుంచెతో అద్భుతంగా చిత్రీకరించి భక్తుల మనసులు గెలుచుకున్నారు.
శుక్రవారం సమ్మక్క–సారక్క ఇద్దరూ గద్దెపై కొలువుదీరిన సందర్భంగా, అపారమైన భక్తితో... తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు
హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు):
రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని... భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని సంఖ్యలతో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచార వాదనలకు భిన్నంగా, ఈ సర్వే భారత ఆర్థిక నిర్మాణంలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తోంది.
ఎగుమతులు–దిగుమతులు: అసమతుల్యత స్పష్టం
ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం, భారత... 