దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

On
దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

దేవస్థానంలో వేద పారాయణాలు
నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

 రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494


సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర  స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ మహారణ్యం మురళీధర స్వామి (చెన్నై) వారల దివ్యాశీస్సుల తో జనవరి 18నుండి 24 వరకు సప్తాహ్నిక దీక్షా 
పూర్వకముగా సంపూర్ణ ఋగ్వేద హవనం, సంపూర్ణ సామవేద పారాయణం, విశేషించి, సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులను వేద విధులు సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు. 
 నిరంతర వేద ఘోషతో, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి క్షేత్రంలో చతుర్వేద పారాయణ సంస్కారాలతో అనాదిగా యజ్ఞ యాగాదులు నిర్వహించ బడిన నేపథ్యం ఉంది.
    ధర్మపురి క్షేత్రంలో దశాబ్దాల తర్వాత 
  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా వుండాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యములో ప్రజలందరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో,  స్థానిక శాసన సభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ, హైదరాబాద్ వారి 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణము నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో  దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ, అధ్వర్యములో స్థానిక వేదబ్రాహ్మణుల సహాకారముతో  వారం రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో పారాయణాలు, హోమాలు నిర్వహించారు. విఖ్యాత వేద పండితులు 
 గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ నేతృత్వంలో అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ,
దహగాం అరుణ్ కుమార్ శర్మ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులో,  సూర్య నారాయణ శర్మ ఘపపాఠీ నేతృత్వంలో జూనూతుల త్రివేది శర్మ ఘపపాఠీ, నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ, 
తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ ఋగ్వేద పారాయణాలు, ముత్యాల శర్మ సామవేదం గావించారు.

ప్రముఖుల భాగస్వామ్యం

అపురూప వేద పారాయణ, హోమాల పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలలో బుధవారం  పరమహంస పరివ్రాజకాచార్య ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్యులు, రమణ, నరసింహ మూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న, మాజీ దేవస్థాన చైర్మెన్ శ్రీ ఎస్. దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Tags