చిలుకూరి ఆలయ అర్చకునిపై దాడిపట్ల భక్తుల ఆందోళన
జగిత్యాల ఫిబ్రవరి 11( ప్రజా మంటలు )
చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీమడేలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆలయం ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారదిశర్మ పాల్గొని మాట్లాడుతూ భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధాన కర్తగా ఉండే ఆలయ అర్చకుని పై భౌతిక దాడి నిర్వహించడం శో చనీయమని అన్నారు అర్చకో హరిస్సాక్షాత్ అని భక్తులు నమ్ముతారని అలాంటి అర్చకుని పై కఠినమైనటువంటి పదజాలాన్ని వాడుతూ రామరాజ్య స్థాపనకు మాతో కలిసి రావాలని వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన గుంపుతో చిలుకూరు బాలాజీ అర్చకుని పై ఒత్తిడి తీసుకురావడం ఖండిస్తున్నామన్నారు. మునుముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము ఇటువంటి వారిని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు. రామరాజ్యంలో రాముడు దుష్టసంహారం మాత్రమే చేసినట్లు పురాణాలు చెబుతున్నాయని అన్నారు. అలాంటి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పేరిట రాజ్యస్థాపన చేస్తాము అని గుంపుగా అర్చకుని నివాసమునకు వచ్చి తమకు సహకరించాలని అర్చకుని పై ఒత్తిడి తీసుకురావడం క్షమించరాని నేరమని అన్నారు. ఇతరుల లాగా అర్చకుడు తన పైన దాడికి ప్రతి దాడి చేయడం జరగదని కానీ అర్చకుని మనసు బాధ చెందుతే దాని ప్రభావం సంబంధిత వ్యక్తుల పై ప్రతికూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి సదరు సంఘటన పై స్పందించి ఫోన్ ద్వారా ఆలయ అర్చకునితో మాట్లాడి మనోధైర్యం కలిగేలాగా హామీ ఇవ్వడముపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
