విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభం ఎస్ ఈ సాలియా నాయక్
జగిత్యాల ఫిబ్రవరి 10( ప్రజా మంటలు)
వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించడం లో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ గారు స్పష్టం చేసారు . వినియోగదారునికి కొత్త సర్వీసుల మంజూరులో ఏదైనా కారణం చేత దరఖాస్తును తిరస్కరించకుండా వినియోగదారుడు తగు విధంగా స్పందించడానికి మరొక అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు .
వివిధ కారణాల వలన డిపార్ట్మెంట్ రూల్ కు లోబడి కొత్త సర్వీసుల మంజూరు ఆలస్యం కాకుండా ఉండేందుకు వినియోగదారునికి దరఖాస్తు చేసుకున్న దానిపై మెసేజ్ రూపకంగా ప్రతి ఒక్క దశలో వెళ్తుంది .
ఉదాహరణకు : కొత్త సర్వీస్ మంజూరు నిమిత్తం అవసరమగు పత్రాల కొరకు వినియోగదారునికి వచ్చిన యస్ యంఎస్ ద్వారా తెలుసుకొని నిర్దిష్ట సమయంలో సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది . తద్వారా వినియోగదారునికి అట్టి సర్వీస్ పై మరింత ఆవగాహన ఏర్పడి వెంటనే సంబంధిత పత్రాలు జమ చేయడం వలన సర్వీసులు త్వరిత గతిన మంజూరు చేయడం జరుగుతుంది .
దీని వలన టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పై వినియోగదారునికి పారదర్శకత , జవాబుదారీతనం, సంతృప్తి, నమ్మకం కలుగుతుందని చెప్పారు .
అలాగే వినియోగదారుడు తన అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి కొత్తగా ట్రాకింగ్ చేసే వెసులుబాటు కల్పించాం. దీని ద్వారా వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్ తో టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్‌సైట్ నుండి లేదా టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా వివిధ దశల్లో ఉన్న అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి ఈ ట్రాకింగ్ సిస్టమ్ ను రూపొందించడం జరిగిందని చెప్పారు .
పై వాటిలో వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912 కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.
వినియోగదారునికి మరింత మెరుగైన , నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు వేగవంతంగా , సులభతరంగా చేస్తున్నామని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
