బాలికలు అన్ని రంగాలలో రాణించాలి. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
జగిత్యాల ఫిబ్రవరి 8(ప్రజా మంటలు )
బాలికలు అన్ని రంగాలలో రాణించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమ దశాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల క్రీడా పోటీలను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుతోపాటు ఆట, పాటలలో కూడా రాణించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం లభించడమే కాకుండా క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలికలకు విద్య, ఉద్యోగాలలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశానికి క్రీడారంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టిన పీవీ సింధు, సైనా నెహ్వాల్, నికాత్ జరీనా లాంటి మహిళ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఆడపిల్లలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేష్, జిల్లా విద్యాధికారి రాములు, తాసిల్దార్ రామ్మోహన్ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం
.jpeg)
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు
.jpeg)