నిమ్స్ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్
నిమ్స్ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ
* లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు):
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణ తన 19 వ లైబ్రరీని పంజాగుట్టలోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రి రేడియాలజీ అంకాలజీ విభాగంలో ఏర్పాటు చేశారు. మంగళవారం క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి లు ప్రారంభించారు. ఆసుపత్రిలోని అంకాలజీ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న క్యాన్సర్ పేషంట్ల కోసం ఆకర్షణ తాను సొంతంగా సేకరించిన, కొనుగోలు చేసిన 600 పుస్తకాలను ఈ లైబ్రరీలో పెట్టారు. ఈ పుస్తకాల పఠనంలో పేషంట్లు కొంత సాధారణ స్థితికి వస్తారనే ఆశతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు ఆకర్షణ తెలిపారు. చిన్న వయస్సులోనే పెద్ద మనసుతో తన పాకెట్ మనీతో పాటు పలు చోట్ల పుస్తకాలను సేకరిస్తూ అనాధ పిల్లలు, స్టూడెంట్స్, పేషంట్ల కోసం ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సీవీ ఆనంద్ ఆకర్షణ ను అభినందించారు. ఇప్పటివరకు ఆకర్షణ ఏర్పాటు చేసిన 19 ఓపెన్ లైబ్రరీల్లో మొత్తం 12605 పుస్తకాలను అందచేసినట్లు ఆకర్షణ తండ్రి సతీష్ తెలిపారు. మెట్రో లైబ్రరీ ప్రాజెక్ట్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభించనున్నామని, ప్రతి మెట్రో స్టేషన్ లో ప్రయాణీకుల కోసం లైబ్రరీలను అందుబాటులో ఉంటాయన్నారు. ఆకర్షణ ఏర్పాటు చేయబోయే 25వ లైబ్రరీ ఓపెనింగ్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ కు వస్తారని తెలిపారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఆకర్షణ ఇటీవల జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి న్యూఢిల్లీ వెళ్ళి వచ్చారు. కార్యక్రమంలో రేడియేషన్ అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మోనికా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)