పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

On

20250120_160416

జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )
పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి 
స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ  అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే జారిచేయబడిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్  ఉండాలని ఎస్పీ అన్నారు.
  
రోడ్డు భద్రతా మాసోత్సవాల లో బాగంగా  జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్‌నెస్,స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ పై  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ... జిల్లా లో  రోడ్డు ప్రమాదల నివారనే లక్ష్యంగా స్కూల్స్ బస్ డ్రైవర్స్ కి  ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ పై  అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నరు. చాలా వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణించే వారిలో చిన్న పిల్లలే ఉంటారు కాబట్టి వారి పట్ల చాలా జాగ్రత్త వహించాలని  సూచించారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. పిల్లలని స్కూల్ కి తీసుకొని వచ్చేటప్పుడు, ఇంటికి తీసుకొని వెళ్లే క్రమంలో బస్సు హెల్పర్ వెనుక ముందు చూసుకొన్నాకనే వారిని దించాలి, పిల్లలు రోడ్డు దాటవలసివస్తే హెల్పర్ తప్పక దాటించాలని సూచించారు.  బస్ కి సంబంధించి అన్ని వాహన పత్రాలు  కల్గివుండాలని, బస్సు సరైన కండిషన్ లో ఉందో లేదో ముందే జాగ్రత్తపడాలని, బస్సు బ్రేక్, లైట్స్, ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్ మరియు వైపర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చూసుకోవాలని సూచించారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఎన్నో కుటుంబాలు బస్సు డ్రైవర్ల మీద చాలా నమ్మకంతో తమతమ పిల్లలని స్కూల్స్ కి బస్సుల్లో పంపిస్తున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఈ సంధర్బంగా తెలియజేశారు. ఎవరైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించక పోతే వారిపై చట్టపరమైన చర్యలు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లో  నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై పోలీస్ , ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.  

ఈ సందర్భంగా ఎస్పీ  పలు స్కూల్ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా అని  స్వయంగా పరిశీలించి పాటించని వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 
  
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, DTO  శ్రీనివాస్, RI  వేణు, ఎస్సైలు సుధాకర్, మల్లేశం, గీత, రవాణా శాఖ అధికారులు, స్కూల్ వ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రావు,పోలీస్ సిబ్బంది , స్కూల్ బస్సు డ్రైవర్లు  పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

బీహార్‌లో ఘనంగా ఛఠ్ పూజా వేడుకలు

బీహార్‌లో ఘనంగా ఛఠ్ పూజా వేడుకలు నేడు సూర్యోదయ పూజలు - ఉషా ఆర్గ్యా  పాట్నా, అక్టోబర్ 28: బీహార్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తి, శ్రద్ధలతో ఛఠ్ పండుగను జరుపుకుంటున్నారు. సూర్యదేవుడు మరియు ఛఠ్ మాతకు అంకితమైన ఈ మహా పర్వం, ఉత్తర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పండుగలో భక్తులు...
Read More...
National  State News 

మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై సిక్కిం మహిళా కాంగ్రెస్ తీవ్ర ఖండన

మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై  సిక్కిం మహిళా కాంగ్రెస్ తీవ్ర ఖండన   గ్యాంగ్టాక్ అక్టోబర్ 28: గాంగ్టక్: సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఘటనపై సిక్కిం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కాంగ్రెస్ మహిళా విభాగం విడుదల చేసిన ప్రకటనలో — ఎస్‌డీఎఫ్ ప్రతినిధి యోజనా ఖాలింగ్, ప్రతిపక్ష సభ్యురాలు రీమా చాపగైతో పాటు మరికొన్ని మహిళలపై...
Read More...
National  State News 

12 రాష్ట్రాల్లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియ ప్రారంభం — ఎన్నికల సంఘం ప్రకటన

12 రాష్ట్రాల్లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియ ప్రారంభం — ఎన్నికల సంఘం ప్రకటన న్యూ డిల్లీ అక్టోబర్ 28: భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా నవీకరించేందుకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) పేరుతో భారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రెండో దశలో మొత్తం 12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు చేర్చబడ్డాయి. తుది ఓటరు జాబితా 2026 ఫిబ్రవరి 7న విడుదల కానుంది...
Read More...

పుతిన్ భారత్‌ పర్యటన డిసెంబర్ 5–6న — ప్రపంచ రాజకీయాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం

పుతిన్ భారత్‌ పర్యటన డిసెంబర్ 5–6న — ప్రపంచ రాజకీయాల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం పార్లమెంట్‌లో ప్రసంగం — ప్రతీకాత్మక ప్రాధాన్యం రష్యా-భారత్ వ్యూహాత్మక బంధం ప్రపంచ పరిణామాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం న్యూ ఢిల్లీ/ మాస్కో అక్టోబర్ 28: భారత్-రష్యా సంబంధాలకు కొత్త దశ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఇది రెండు దేశాల మధ్య 23వ వార్షిక...
Read More...
Local News 

హరీశ్ రావుకు పితృవియోగం

హరీశ్ రావుకు పితృవియోగం హరీశ్ రావుకు పితృవియోగం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (ప్రజామంటలు) :తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు  పితృవియోగం కలిగింది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు, అక్టోబర్ 28,తెల్లవారు 4 గంటల ప్రాంతంలో...
Read More...
Crime  State News 

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):ఇటీవల పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ముందు హాజరై, ఫిర్యాదు సమర్పించారు. రియాజ్ తల్లి, భార్య, మరియు చిన్నపిల్లలు కలిసి కమిషన్ ఎదుట తమపై పోలీసుల వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ప్రకారం,...
Read More...
Local News 

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక   డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల విరూపాక్షి గార్డెన్ లో A4 దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ. A4 దుకాణాల మద్యం దుకాణాల కోసం లాట్ల డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్ లో నిర్వహించారు.  డ్రా నిర్వహణ సందర్బంగా ఎలాంటి...
Read More...
Crime  State News 

ఆదిలాబాద్‌లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా

ఆదిలాబాద్‌లో సైబర్ మోసం కేసు — వలపు వలతో ఎనిమిది లక్షలు స్వాహా ఆదిలాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు): వలపు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘరానా సైబర్ ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా గొంతుతో మాట్లాడి, ప్రేమ పేరుతో బాధితులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను సూర్యాపేట జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, మూడు...
Read More...
Crime  State News 

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య — కామారెడ్డి విషాదం   కామారెడ్డి అక్టోబర్ 27 (ప్రజా మంటలు): కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం “డ్యూటీకి వెళ్తున్నా” అని ఇంటి నుండి బయలుదేరిన జీవన్ రెడ్డి, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని...
Read More...
Local News  State News 

స్కాలర్ షిప్ లు  ప్రభుత్వ బిక్ష కాదు  - విద్యార్థుల హక్కు : ఏబీవీపి

స్కాలర్ షిప్ లు  ప్రభుత్వ బిక్ష కాదు  - విద్యార్థుల హక్కు : ఏబీవీపి సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) సికింద్రాబాద్‌ జిల్లా మారేడుపల్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కాలర్షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం  మారేడ్ పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గేట్ ముందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి...
Read More...
Local News  State News 

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల

బంగారం రేట్లు రోజులోనే రూ.2,340కి పడిపోయాయి — హైదరాబాద్‌లో కూడా తగ్గుదల హైదరాబాద్ అక్టోబర్ 27: బంగారం ధరల్లో అకస్మాత్తుగా పెద్ద పతనం నమోదైంది. ఈరోజు (అక్టోబర్ 27) ఉదయం గ్రాముకు రూ.1,050 తగ్గిన రేటు, సాయంత్రానికి మరో రూ.1,290 పడిపోవడంతో మొత్తం రూ.2,340 తగ్గింది.హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150...
Read More...
Local News 

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 46వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి 14...
Read More...