ముగిసిన సింగపూర్ పర్యటన - దావోస్ బయలుదేరిన రేవంత్ బృందం
ముగిసిన సింగపూర్ పర్యటన - దావోస్ బయలుదేరిన రేవంత్ బృందం
సింగపూర్ జనవరి 20:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయల్దేరుతోంది.
చివరి రోజున ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులతో కూడిన బృందం సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది.
ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్ డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తదితరులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి తెలంగాణలో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు.
హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.
సింగపూర్ నుంచి సీఎం గారితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు దావోస్ కు బయల్దేరనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)