ఉచిత విద్య ,వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జనవరి 19 (ప్రజా మంటలు)
ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ.జీవన్ రెడ్డి
జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల అర్బన్ , రూరల్ మండలం , సారంగపూర్ , బీర్పూర్ , రాయికల్ మండలాల సీఎం సహాయ నిధి 1 కోటి 85 లక్షల 20 వేల రూపాయల చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుందన్నారు.
10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన నడిచిందనీ
గతంలో అమలు చేసిన కార్యక్రమాలు అన్ని కొనసాగిస్తూ వాటికి అదనంగా ఈ సంవత్సర కాలంలో
రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రాథమిక హక్కులలో భాగంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
ప్రభుత్వ పరంగా ఆరోగ్య శ్రీ లో జరిగే వైద్య సదుపాయాలను వినియోగించుకివాలి సీఎం సహాయనిది ద్వారా కొంత మాత్రమే మనకు లబ్ది చేకూరుస్తుంది కానీ ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తిగా వైద్య సదుపాయం పొందవచ్చు అని అన్నారు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం అని అన్నారు
కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు వివరించారు
1 తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమమే ద్యేయంగా ఉచిత బస్ రవాణా సౌకర్యం
80 శాతం ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతున్నారు అని అన్నారు
ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ 85 శాతం జరిగింది అన్నారు
2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి ఉంది కాని నిధుల కొరతతో మాత్రమే జాప్యం అవుతుంది అని అన్నారు
దశలవారీగా ఇవ్వడంతో ఆ డబ్బులు వడ్డీకి పోయాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంగా రుణమాఫీ చేసిందని అన్నారు
పెట్టుబడి దారులకు మాత్రమే బీజేపీ లక్షల కోట్ల అప్పుల రుణాన్ని బ్యాంకుల ద్వారా మాఫీ చేస్తుంది కానీ రైతులకు రుణమాఫీ చేసే ఆలోచన లేదు అని అన్నారు
గతంలో రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడకుండా అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ప్రధానిగా మన్మోహన్ ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేశారని అన్నారు
కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తే 2 లక్షల పైన ఉన్న వారు కూడా రుణమాఫీ చేయవచ్చని అన్నారు
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణమాఫీ చేయడానికి సహాయం వారి బాధ్యతగా సహాయం అందించాలని అన్నారు.
గతంలో ఆరోగ్య శ్రీ 5 లక్షలు ఉన్న పరిమితి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు అని అన్నారు
రేషన్ కార్డుల జాబితాలో పేరు రానివారు ఆందోళన చెందవద్దని రేషన్ కార్డ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు
21వ తేదీ నుండి గ్రామసభ వార్డు సభలలో పేరు రాని వారు మళ్లీ నమోదు చేసుకోవాలని అన్నారు
గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు
అర్హత కలిగిన వారందరికీ గృహ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు
పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన ఫలితం పొందలేకపోయినా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గల్ఫ్ లో అకాల మరణం పొందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల సహాయం అందే విధంగా కార్యక్రమాన్ని అమలు జరిగే విధంగా చేయగలిగాను అని అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు
