గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం జనవరి 15:
ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్లో ఉండాల్సిన నీటి సామర్థ్యం కంటే తక్కువ నీటి నిల్వ ఉందని,దీని వలన పంట సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి విన్నవించారు .
విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్ ను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు..*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధర్మారం మండలంలోని మేడారం చెరువుకు గొప్ప చరిత్ర ఉందని,గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో చెరువును రిజర్వాయర్ గా మార్చి, పైప్ లైన్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట కు హరీష్ రావు నీటిని తరలించడం జరిగిందని,అయినప్పటికీ ఇక్కడి బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజప్రతినిధులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
ఇక్కడి ప్రాంత రైతాంగానికి నీటి అవసరం ఎంత ఉంది,నీళ్ళ వాట ఎంత వంటి వాటిని గత పాలకులు పట్టించుకోలేదని,గత పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని,ధర్మపురి తలపున గోదావరి ఉన్న,ధర్మారం మండలంలో మేడారం రిజర్వాయర్ ఉన్న ఇక్కడి రైతంగానికి సాగు నీరు అందించే విషయంలో గత పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని,నేను స్వయంగా ఈ విషయాన్ని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,వారు వెంటనే స్పందించి గోదావరిలో ఒక టీఏంసి నీటినీ విడుదల చేయడం జరిగిందని తెలిపారు,
మేడారం రిజర్వాయర్ ను కూడా ఈ రోజు నింపడం జరుగుతుందని,త్వరలోనే ధర్మపురి నియోజకవర్గంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉంటుందని,వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ఇరిగేషన్ పైన ఒక రివ్యూను ఏర్పాటు చేసి సాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
