ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు. ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్
ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు. ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 10:
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లా ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
జిల్లాలో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలకి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే దర్శనం చేసుకోవడం జరిగిందని,వివిధ పుణ్యక్షేత్రంలో ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండ చూసిన పోలీస్ అధికారులు , క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషిని ఎస్పీ అభినందించారు.
ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ ప్రశాంత వాతావరణంలో పండగలను నిర్వహించడానికి పోలీస్ శాఖ తరపున కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
ఎస్పీ గారి వెంట డిఎస్పి రఘు చందర్, ధర్మపురి సి.ఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ లు, ఉదయ్ కుమార్, సతీష్, ఉమ సాగర్, శ్రీధర్ రెడ్డి ఉన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్
