ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్

On
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్

సూర్య గ్లోబల్ పాఠశాలలో  జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
జగిత్యాల జనవరి 09: 
జగిత్యాల జిల్లా కే౦ద్రం లోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లడుతూ జిబ్రాక్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియామాలు, ప్రాంతీయ చిత్రాలు చిన్నారులు చాలా బాగా చిత్రీకరించి, అవగాహన కల్పించడం ఆనందదాయకమన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ S.I . మల్లేష్ మాట్లడుతూ హెల్మెట్ ధరించడం గురించి మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవడం , మద్యం త్రాగి బండి నడపడం వలన జరిగే ప్రమాదాలను గురించి | తెలుపుతూ, ట్రాఫిక్ నియామాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపు తున్న వారిని అభినందించాలన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించాలన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిం చారు.  ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు పూలు అందించి అభినందించారు. పాఠశాల డ్రైవర్ లకు హెల్మెట్ లను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో చిత్రాలను ప్రదర్శించిన చిన్నారులను మరియు అధ్యాపక బృందాన్ని
అభినందించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై మల్లేశం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, డైరక్టర్స్ హరిచరణ్ రావు, మౌనికరావు, రజిత, అసిస్టెంట్  వెహికల్ ఇన్స్పెక్టర్లు రామారావు, ప్రమీల, అభిలాష్, రియాజ్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జగిత్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని పురాణిపేట, మంచినీళ్ల బావి, గాంధీనగర్ ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గజెంగి నందయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ సేవలను స్మరించుకున్నారు. సత్యం,...
Read More...
Local News 

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి: దావ వసంత సురేష్

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి: దావ వసంత సురేష్ జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ అహింసా మార్గంలో...
Read More...
Local News 

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ప్రెస్ క్లబ్ ఆర్థిక సాయం

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ప్రెస్ క్లబ్ ఆర్థిక సాయం జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు): కరీంనగర్‌లో వైద్య చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.57,100 ఆర్థిక సహాయాన్ని నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి, తమ వంతు సహకారం...
Read More...
Local News 

చలో సిరిసిల్ల సభ విజయవంతం చేసిన జగిత్యాల ప్రజలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ధన్యవాదాలు

చలో సిరిసిల్ల సభ విజయవంతం చేసిన జగిత్యాల ప్రజలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ధన్యవాదాలు జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ‘చలో సిరిసిల్ల’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు జగిత్యాల నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హృదయపూర్వక...
Read More...
Local News 

జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన

జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన జగిత్యాల, అక్టోబర్ 1 (ప్రజా మంటలు): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా శాఖ పిలుపునిచ్చింది. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఉదయం 10.30 గంటలకు...
Read More...
Local News 

జగిత్యాల వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం.. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం

జగిత్యాల వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం.. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం జగిత్యాల, అక్టోబర్ 1 (ప్రజా మంటలు): అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివగాయత్రి వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో వైద్యులు డాక్టర్ ఇనుగుర్తి...
Read More...
National  Crime 

ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం న్యూఢిల్లీ సెప్టెంబర్ 30: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్, కెప్టెన్‌పై కత్తితో దాడి చేసినట్లు అధికారులు, ప్రయాణికుల వాంగ్మూలాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో విమానం ఒక్కసారిగా భారీగా ఎత్తు కోల్పోయి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది....
Read More...
Local News 

సంక్షేమం–అభివృద్ధితో తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

సంక్షేమం–అభివృద్ధితో తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు): సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సిరిసిల్లకు చేనేత రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉందని...
Read More...
State News 

ఉద్యోగుల అంకితభావంతోనే సంక్షేమ ఫలాలు ప్రజలకు: సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల అంకితభావంతోనే సంక్షేమ ఫలాలు ప్రజలకు: సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కలిపి సుమారు 10.5 లక్షల మంది ఉద్యోగులు 4 కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని, ఉద్యోగుల...
Read More...
Local News 

సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర.. రూ.340 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర.. రూ.340 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు): ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో 3 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు ప్రాంతంలోని బహిరంగ సభ ప్రాంగణం వరకు ప్రజల మధ్య నడుస్తూ అభివాదం చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు....
Read More...
Local News 

18 మంది లబ్ధిదారులకు రూ.3.94 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

18 మంది లబ్ధిదారులకు రూ.3.94 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.3,94,500 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను బీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వివిధ అనారోగ్య...
Read More...
Local News 

సీఎం పర్యటన పేరుతో ప్రజా గొంతుకను అణచివేయడం సరికాదు : బి ఆర్ ఎస్ నాయకుల విమర్శ

సీఎం పర్యటన పేరుతో ప్రజా గొంతుకను అణచివేయడం సరికాదు : బి ఆర్ ఎస్ నాయకుల విమర్శ    జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. సీఎం పర్యటనలకు భద్రత కల్పించడం పోలీసుల...
Read More...