జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
- పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
- CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
- పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.
- ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 786 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
- పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు.
- ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.
- దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
- అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.
- అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
- అజ్ఞాత వ్యక్తుల కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు.
- ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం RSI కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్, లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.
సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి చాలా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ అజర్ యాకూబ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉత్తమ సేవ పథకాల కి ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్... గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్... కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*
2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం
కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే... పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ
జగిత్యాల జనవరి 1( ప్రజా మంటలు)
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో... ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 1 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల... రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’
న్యూఢిల్లీ, జనవరి 01 (ప్రజా మంటలు):
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో ‘యానిమల్ కంటింజెంట్’ ను ప్రవేశపెట్టనుంది. ఇది దేశ సైనిక చరిత్రలోనే ఓ వినూత్న ఘట్టంగా నిలవనుంది.
ఈ యానిమల్... అయ్యప్ప ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు
జగిత్యాల జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు.
అనంతరం జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ,... నూతన సంవత్సర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి
జగిత్యాల/వేములవాడ జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని, అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.... కేసీఆర్ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ
సిద్దిపేట జనవరి 01 (ప్రజా మంటలు):
తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించినందుకు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా... హైదరాబాద్లో న్యూ ఇయర్ కిక్కే ‘కిక్కు’ – రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ నగరం మొత్తం వెలుగుల్లో మునిగిపోయి ఉత్సాహంగా కనిపించింది. అయితే ఈ ఉత్సవాల వెనుక నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు.
న్యూ ఇయర్... 