వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
క్షేత్ర ప్రాధాన్యత
అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.
ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు
శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ, భక్తాంజనేయ, మార్కండేయ, అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

"ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు, అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి, రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి, ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం
న్యూఢిల్లీ, జనవరి 27 (ప్రజా మంటలు):
భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా **“అన్ని ఒప్పందాలకు తల్లి”**గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక... సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు
జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు):
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు.... కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.
గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి... 