అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం. - ధర్మపురి అరవింద్ ఎంపీ,నిజామాబాద్
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు) :
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని దిశ చైర్మన్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జరిగింది.జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్డూరి లక్ష్మణ్ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డి లతో కలిసి చైర్మన్ కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ శాఖలకు వచ్చే నిధులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిస్వార్థపరంగా పనిచేస్తూన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు.
దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను 3 మాసాలకు సమీక్షించుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు స్వఛ్చ భారత్ కింద బాత్ రూమ్ లకు ప్రాధాన్యత కల్పిస్తూ కొత్త వాటికి ప్రతిపాదనలు ఇవ్వకుండా మరమ్మతులకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన సూచించారు. జగిత్యాల జిల్లాను స్మార్ట్ సిటీలో భాగం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగా సమావేశంలో అమృత్ పథకం , సమగ్ర శిక్ష అభియాన్ నేషనల్ హైవేస్ గ్రామీణ సడక్ యోజన నేషనల్ హెల్త్ మిషన్ ఆవాస్ యోజన సెంట్రల్ ఫండ్ ద్వారా వివిధ రోడ్డు ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం మెట్రిక్ స్కాలర్షిప్లు మల్టీ సెక్యులర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేబర్ డిపార్ట్మెంట్ మైనారిటీ స్కూల్ నేషనల్ లైట్ మిషన్ స్వచ్ఛభారత్ పీఎం సమ్మిది పై రివ్యూ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం అందించే నిధులను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని చైర్మన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు ఆదేశించారు.
స్వచ్చ భారత్ పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఉపాధి హామీ, విద్యుత్ , మిషన్ భగీరథ, జాతీయ రహదారులు,తదితర అంశాలపై సమీక్షించారు.
అనంతరం ముందుగా జిల్లాలోని ఆర్మూర్ మంచిర్యాల ఎన్ 63, జగిత్యాల డివిజన్లో కోరుట్ల మెట్పల్లి జరుగుతున్న నాలుగు వరుసల రోడ్డు పనులను త్వరిగతన చెయ్యాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఈ జి ఎస్ నిధుల కింద జిల్లాలో మంజూరైన రోడ్లు బ్రిడ్జిల్ని దమ్మన్నపేట కాచారం రోడ్డుని పూర్తి చేయాలని తెలిపారు. అమృత పథకం కింద జిల్లాలో మొత్తం జరుగుతున్న ప్రాజెక్టు వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో పీహెచ్ సెంటర్ 70సబ్ సెంటర్ 150 అధికారులు తెలిపారు .త్వరలో దిశ కమిటీ వేసి సభ్యులను నామినేట్ చేస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ,ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ఎఫ్ సి ఐ ద్వారా జరిగే వడ్ల కొనుగోలు సజావుగా జరిగే విధంగా దృష్టి సారించాలని,జిల్లా అధికారులు మరియు ఎఫ్ సి ఐ అధికారులు సమన్వయంతో పనిచేయాలని,మిగిలిన ధాన్యం నిల్వలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మరియు ఎఫ్ సి ఐ నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్ళు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు.. ఈ కార్యక్రమంలో, డిఆర్డిఓ ,రఘువరన్, మున్సిపల్ చైర్మన్లు, అడువాల జ్యోతి, మోరా హనుమాన్లు , వివిధ జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భైంసాలో అనుమానాస్పద సంబంధంపై ఘోర హత్య
నిర్మల్ డిసెంబర్ 09:
నిర్మల్ జిల్లా భైంసాలో ప్రేమ సంబంధం తీవ్ర విషాదానికి దారితీసింది. నందన టీ పాయింట్ వద్ద 27 ఏళ్ల అశ్వినిని ఆమె ప్రియుడు నగేష్ కత్తితో దారుణంగా హత్య చేశాడు.
రెండేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అశ్విని, నగేష్‌తో ప్రేమలో పడి అతనితో కలిసి నివసిస్తోంది. ఉపాధి కోసం అశ్వినికి... రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 08 (ప్రజామంటలు): :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ... పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం
రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర
వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
*కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా
సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు.... జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్
**
జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు) భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ... స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్ * ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు)
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సి.ఐ సుధాకర్ మాట్లాడుతూ.... ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం
జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు.
సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి... అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్
కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్‌ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం... తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు.
సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3... వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి... మేడ్చల్–మల్కాజ్గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత
ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,”
తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్పల్లి ప్రెస్ మీట్
కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
మేడ్చల్–మల్కాజ్గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన... “ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్
“స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు”
హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు):
ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల... 