బి.సి వసతి గృహాలకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. - జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.

On
బి.సి వసతి గృహాలకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. - జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) : 

జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..... రాష్ట్రంలోని 296 బీసీ కళాశాల వసతి గృహాలు 321 గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని బి సి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

హాస్టల్లల్లో, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీల పెంపుపై కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల తమ నిరంతర పోరాటం తర్వాత మెస్ చార్జీలను పెంచడం ద్వారా సుమారు 8.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన బి సి కమిషన్ అందించే నివేదికకు ఆధారంగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో "ప్రత్యేక డెడికేషన్ కమిషన్" ఏర్పాటు చేసి రిజర్వేషన్లు వెంటనే ఖరారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

మరియు రాష్ట్రంలో హాస్టల్లో గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం హర్షణీయమని ముఖ్యమంత్రి కి, ఉపముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అయితే మెస్ చార్జీలు పెంచడం వల్ల రాష్ట్రంలోని 8 లక్షల 60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

కాలేజీ హాస్టళ్ళకు 1500 నుంచి 2100, గురుకుల హాస్టళ్లలో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 నుంచి 1330, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1540కి పెంచడంతోపాటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచారన్నారు.

అయితే పెంచిన ధరల ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలన్నారు.

అలాగే రాష్ట్రంలోని 295 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 321 బి సి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు నెలకు 500 చొప్పున పాకెట్ మనీ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి మహిళా సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత జాగృతి జనం బాట ఆదిలాబాద్‌లో కల్వకుంట్ల కవిత నిరుద్యోగుల సమస్యలపై మండిపాటు – జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి తలమడుగులో రైతు కుటుంబాన్ని పరామర్శించిన కవిత ఆదిలాబాద్ నవంబర్ 4 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్‌లో “జాగృతి జనం బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా 33...
Read More...

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు – పత్రాలు లేని వాహనాలకు హెచ్చరిక జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) షేక్ రియాజ్ స్వయంగా పర్యవేక్షించారు. తనిఖీలలో భాగంగా పలు వాహనాల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు....
Read More...
Local News  State News 

తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు

తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు     * పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా విమర్శ సికింద్రాబాద్, నవంబర్ 04 (ప్రజామంటలు): మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా సంచలన వ్యాఖ్యలు చేశారు.  గడిచిన పదేళ్ల బిఆర్ఎస్...
Read More...
Local News  State News 

పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?

పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?   *వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం    *యువత సమైక్య భారత్‌ నిర్మాణానికి ముందుకు రావాలి    *రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్    *సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్...
Read More...
Local News 

శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు

శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు - అభినందించిన కళాశాల యాజమాన్యం...  సికింద్రాబాద్,  నవంబర్ 04 (ప్రజా మంటలు) :  పట్టుదలతో చదివితే విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ కె. రాధా కిషన్ రావు అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, పి. హేమశ్రీ అసాధారణ విజయాన్ని గర్వంగా జరుపుకుంది. జవహర్‌లాల్...
Read More...

వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్

వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్ ఫీజు రియాంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వై.ఎస్.ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉందని జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ విమర్శించారు. ఫీజు రియాంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన...
Read More...
Local News  State News 

ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ

ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు): ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 25 (తేదీ 12.08.2021) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరగాలని పిఆర్టియుటిఎస్ (PRTUTS) జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది. జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినపల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యా...
Read More...

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు మెటుపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్‌లో దుర్మరణం చెందగా, ఆయన మృతదేహం ఇప్పటివరకు అక్కడి అతిశీతల శవాగారంలో నిల్వ ఉంది. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని బహరేన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది....
Read More...

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు 

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో  గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు  ఇబ్రహీంపట్నం నవంబర్ 4 (ప్రజా మంటలు: దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ–ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రతిరోజు ప్రయాణించే వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతుండడంతో, స్థానిక నాయకులు ముందడుగు వేసి శ్రమదానానికి దిగారు. అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేకపోవడంతో, వర్షకొండ...
Read More...

: “పాము పగ పట్టిందా?” — గొల్లపల్లి మండలంలో నెల రోజుల్లోనే ఏడుసార్లు పాము కాటు వేసిన యువకుడు!

: “పాము పగ పట్టిందా?” — గొల్లపల్లి మండలంలో నెల రోజుల్లోనే ఏడుసార్లు పాము కాటు వేసిన యువకుడు! (అంకం భూమయ్య) గొల్లపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు):పల్లెల్లో పెద్దలు తరచుగా “పాము పగ పడుతది” అని చెప్పే మాటను చాలామంది మూఢనమ్మకం అంటారు. కానీ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ మాటలో నిజం ఉందేమో అనే సందేహం కలిగిస్తోంది. నెల రోజుల్లోనే 7 సార్లు...
Read More...

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ నేతలు అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) నాయకులు మాట్లాడుతూ బీసీ హక్కుల సాధనకు కేంద్ర...
Read More...
National 

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి బిలాస్‌పూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 04:చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం కోర్బా ప్యాసింజర్ రైలు నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 6మంది మృతి చెందగా, 25మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు రైల్వే బోగీలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు....
Read More...