డైట్ ఛార్జిల పెంపుపై గొల్లపల్లిలో గురుకులంలో సంబరాలు.

- విద్యార్థులతో కేక్ కట్ చేయించిన ప్రిన్సిపల్.

On
డైట్ ఛార్జిల పెంపుపై గొల్లపల్లిలో గురుకులంలో సంబరాలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 2 ( ప్రజా మంటలు ) : 

రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో గొల్లపల్లి లోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో సంబరాలు జరుపుకొన్నారు. పాఠశాల అవరణలోనే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత విద్యార్థులతో కేక్ కట్ చేయించి సంబరాలను జరుపుకొన్నారు.

ఈ సందర్బంగా డి.సి.వో, ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత మాట్లాడుతూ......నిరుపేద విద్యార్థిని, విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని డైట్, కాస్మోటిక్ ఛార్జిలను పెంచారన్నారు. అలాగే ఈ నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేయడం విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ సారి 40శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో రాష్ట్రంలోని 7 లక్షల 65వేల 705 మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలతో పాటు పలు శాఖల కార్యదర్శులకు విద్యార్థుల పక్షాన ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో అ పాఠశాల టీచర్లు, సిబ్బంది, విద్యార్ధినులు ఉన్నారు.

Tags