సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
- ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం
వేములవాడ, నవంబర్ 03:
రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారములని, సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తున్నదనీ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ పట్టణంలో మల్లారం రోడ్డులో జవహర్ లాల్ నెహ్రూ బీఈడీ కాలేజీలో ఆదివారం నాడు ఈశ్వర గారి ముక్తేశ్వరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కథా సంపుటి, వ్యాస సంపుటీ, ఆధ్యాత్మిక గ్రంథాల పోటీలలో విజేతలుగా నిలిచిన సాహితీ వేత్తల పురస్కారాల ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
వేములవాడ ప్రాంతంలోని రచయితలు ప్రముఖ రచయితలుగా ఎదిగారని, తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన హనుమాజీపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని రవీంద్రభారతిలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల ఘనంగా నిర్వహించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డితో సహా , న్యాయమూర్తి జింబో మంగారి రాజేందర్ తదితరులు తెలుగు సాహిత్యంలో ఉద్దండలుగా ఎదిగారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వేములవాడలో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన ప్రముఖ విద్యావేత్త ఈశ్వర గారి నరహరి శర్మ గారు తన సతీమణి స్మారకంగా సాహిత్య పురస్కారాలను ప్రధానం చేయడం వారి గొప్పదనాన్ని తెలియజేస్తుందని అన్నారు. శర్మ వారి విద్యాసంస్థలలో ఎంతోమంది పేద విద్యార్థులకు
అవకాశాలు కల్పించి సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సాహిత్యం సామాజిక విలువలను ఉన్నతీకరించడానికి, కొంగొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నదని అన్నారు.
సాహితి పురస్కారాలను సమర్ధులైన రచయితలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణయతలను అభినందించారు.
తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన ప్రముఖ సాహితీవేత్త బిఎస్ రాములు మాట్లాడుతూ, సాహిత్యంలో ఉన్నతమైన విలువలను పెంచడానికి ఈ పురస్కారాలు రుజువు చేస్తున్నాయని, తన సతీమణి పేరట విద్యావేత్త నరహరిశర్మ సాహితీ పురస్కారాలు ఇవ్వడం ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. మత సంపుటి విభాగాల ఎంపికకు న్యాయ నిర్నేతగా వ్యవహరించిన న్యాయమూర్తి మంగారి రాజేందర్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో కథ సాహిత్యం గొప్ప విస్తృతిని కలిగి ఉన్నదని అన్నారు. తాను రాసిన వేములవాడ కథలు ప్రజాదరణ పొందాయని అన్నారు. మాజీ శాసనసభ్యులు, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధిలో నరహరి శర్మ పాత్ర ఎంతగానో ఉందని ప్రశంసించారు.

ఈ సందర్భంగా వేములవాడ అనువంశిక రచయిత చెప్పకట్ల భాను శర్మ రచించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన గ్రంథాన్ని జేఎన్ఎంఎస్ విద్యాసంస్థల అధినేత ఈశ్వరగారి నరహరి శర్మ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గిరిజ మనోహర్ బాబు, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డిలు లాంచనంగా ఆవిష్కరించారు.
డెబ్భై ఏడు(77) వసంతాలు పూర్తి చేసుకున్న విద్యావేత్త నరహరి శర్మ ను పలువురు ఘనంగా శాలువాలు కట్టి సన్మానించారు. తన సతీమణి పేరిట వచ్చే సంవత్సరం నుండి కవితా సంపుటి విభాగంలో ఎంపికైన రచనకు కూడా సాహితీ పురస్కారము అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. వేములవాడ యశోదరులుగా ఎంపికైన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కొమరవెల్లి రాజేందర్, ప్రముఖ రచయిత సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, తదితరులను నిర్వాహకులు ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు.

సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ప్రముఖ రచయితలు డాక్టర్ నమిలకొండ సునీత, నాయిని సుజనాదేవి,. డా.అమరవాది నీరజ, ముని సురేష్ పిల్లై, గర్రెపల్లి అశోక్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, వేణుశ్రీ, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, యోగాచార్య సంపత్ కుమార్, ఆడేపు లక్ష్మీపతి, దూరదర్శన్ రిటైర్డ్ అధికారి కృష్ణారావు, గో సంరక్షకులు, సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ, తెలంగాణ పత్రిక పూర్వ సంపాదకులు అష్టకాల రామ్మోహన్ శర్మ, తదితరులను ఫౌండేషన్ తరపున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇదొక మనసును కలచివేసే, ఆలోచింపజేసే విషాదం.
అజిత్ పవర్ విమాన ప్రమాద దృశ్యాలు విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
ముంబయి, జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కుప్పకూలి, ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ... దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 27 ( ప్రజా మంటలు)సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి... భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం
న్యూఢిల్లీ, జనవరి 27 (ప్రజా మంటలు):
భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా **“అన్ని ఒప్పందాలకు తల్లి”**గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక... సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... 