గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు

On
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.   
 హైదరాబాద్ అక్టోబర్ 17:

 ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు.

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు. 


    ఈ సందర్బంగా    సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ,  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.  దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు,అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని,సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. 


 TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రూప్ -1  జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. 
 

TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27  మొత్తం 46 కేంద్రాలలో  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.

అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని SPDCL ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 
--

Tags

More News...

Local News 

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ భీమదేవరపల్లి మండలంలో కేక్ కట్, పండ్ల పంపిణీ, సామాజిక సేవ కార్యక్రమాలు ప్రజామంటలు, ముల్కనూర్:కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని భీమదేవరపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
Read More...
Local News 

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*  

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   *గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   ప్రజా మంటలు వేలేరు.  గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా రైతులతో తుది సదస్సు ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే  అర్జీ రూపేనా మాకు సమర్పించండి. వాటిని ఒక కొలిక్కి తీసుకువచ్చి భూ నిర్వాసితులకు క్రమబద్ధీకరించగలము. రైతులు వారి వారి పాసుబుక్ 
Read More...
Local News 

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు):జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇట్టబోయిన భూపతి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ...
Read More...
Local News 

రోడ్లపై గుంపుగా ఉన్న చెట్లను తొలగించండీ

రోడ్లపై గుంపుగా ఉన్న చెట్లను తొలగించండీ   అధికారులు వేడుకుంటున్నా వాహనదారులు  గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వెల్కటూర్ వెళ్లే రహదారిలో రోడ్డుకి ఇరువైపులా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇరిగి,వంగిన చెట్లు. రోడ్డుపై గుంపుగా ఉన్న  నిత్యం స్కూలుకు వెళ్లే పిల్లలు వాహనదారులకు, పాదాచారులకు ప్రమాదం పొంచి ఉందని సమస్యపై  పరిష్కారం...
Read More...
Local News 

రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు

రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు    జగిత్యాల జూలై 11 ( ప్రజా మంటలు)   పట్టణంలోని సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ట్రస్స్మా జిల్లా అధ్యక్షులు బి శ్రీధర్ రావు మరియు పాఠశాల చైర్మన్ మంజుల రమాదేవి  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ...
Read More...
Local News 

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో పై దాడి పై ఖండన

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో పై దాడి పై ఖండన జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు) ప్రముఖ పుణ్యక్షేత్రం  భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి పై దాడి నిరసిస్తూ జగిత్యాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీరామ మందిరం కార్యనిర్హణాధికారి ఆలయ అర్చకులు సిబ్బంది భద్రాచలం ఈవో పై జరిగిన ఘటనను ఖండిస్తూ ఆలయం బయట నిరసన వ్యక్తం చేశారు. ఈ...
Read More...
Local News 

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం మెట్ పల్లి జులై 10 (ప్రజా మంటలు)రైతులు నాట్లు వేసే ప్రస్తుత ముమ్మర దశలో పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది  రైతులను పంట పొలాల్లోనే కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం గుండంపల్లి గ్రామం సందర్శించిన సందర్భంగా మెటుపల్లి ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూదన్ మాట్లాడుతూ రైతులు...
Read More...
Local News 

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు)స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో భగవద్ గీత శిక్షణ తరగతులు ప్రారంభ మయ్యాయి. గురువారం నుండీ 10రోజుల పాటు సాయంత్రం 6గంటల నుండి 7గంటల వరకు రోజు గంట పాటు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం ,...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి సికింద్రాబాద్, జూలై 11 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయారు. ఓపి బ్లాక్ ఎదురుగా 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి,  NTPC హాల్లో 55-60 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీ లు లభించాయి. అలాగే మెడికల్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి...
Read More...
Local News 

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ  ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం...
Read More...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు జూలై 10, ఎల్కతుర్తి (ప్రజామంటలు) :ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సౌందర్య, బండి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి  గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ...
Read More...
Local News 

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు సికింద్రాబాద్ జులై 10 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న హిందీ అధికారిక భాషా విభాగం 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో  గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు.ఈ మేరకు  సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్లో  ఆమె శుక్రవారం మీడియాకు...
Read More...