ముషీరాబాద్ లో కాంగ్రెస్ - బి అర్ ఎస్ కార్యకర్తల బాహా బాహీ కేటీఆర్ వాహనాన్ని అడ్డుకొని దాడికి యత్నం
ముషీరాబాద్ లో కాంగ్రెస్ - బి అర్ ఎస్ కార్యకర్తల బాహా బాహీ
కేటీఆర్ వాహనాన్ని అడ్డుకొని దాడికి యత్నం
హైదారాబాద్ అక్టోబర్ 01:
గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్తుండగా, ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు.వారిని భా రా స కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.
అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారన్నారు. గరీబోళ్లంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నరని, వాళ్ల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. మూసీమే లూఠో.. దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదమని విమర్శించారు. మీ ఇండ్ల మీదకు బుల్డోజర్ వస్తే కంటె అడ్డుపెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరన్నారు.

కాగా, కేటీఆర్ కారుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఘటనపై బీఆర్‌ఎస్ పార్టీ తవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించింది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీసింది. రేవంత్.. నీ అప్రజాస్వామిక చర్యలకు ప్రజలు నిన్ను మూసీలో కలపడం ఖాయమని హెచ్చరించింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
