రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
*ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు*
'ప్రవాసీ ప్రజావాణి' తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం
◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే... ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు !
◉ భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం
హైదారాబాద్ సెప్టెంబర్ 26:
విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
ఈనెల 27 వ తేదీ శుక్రవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో " ప్రవాసీ ప్రజావాణి " ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది.
శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న " ప్రవాసీ ప్రజావాణి ' ఏర్పాట్లను ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ( దుబాయ్ ), బొజ్జ అమరేందర్ రెడ్డి ( అమెరికా ), గంగసాని నవీన్ రెడ్డి ( లండన్ ), చెన్నమనేని శ్రీనివాస్ రావు గురువారం ప్రజా భవన్ లో పరిశీలించారు.
గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి 'ప్రవాసీ ప్రజావాణి' ఉపయోగపడుతుంది.
వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు " ప్రవాసీ ప్రజావాణి " లో నమోదు చేసుకోవచ్చు.
రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసు కోవచ్చు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన ‘పరిష్కృత’ (కథా సంకలనం) మరియు ఆమె స్వీయ కథా సంపుటి ‘సహజాత’ పుస్తకాల పరిచయ... మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు
ఉజ్జయిని జనవరి 23 (ప్రజా మంటలు):
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వీఎచ్పీ (VHP) నాయకుడిపై జరిగిన దాడి అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి అల్లర్లు చెలరేగినట్లు సమాచారం. ఆందోళనకారులు పలుచోట్ల బస్సులకు నిప్పు పెట్టడంతో పాటు ఇళ్లపై రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు.
హింస తీవ్రత పెరగడంతో పోలీసులు భారీగా... శ్రీనగర్లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం
శ్రీనగర్ జనవరి 23:
శ్రీనగర్ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
మంచు పరిస్థిత
శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం... కేటీఆర్, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్
హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు):
సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ... పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు. జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్
బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు?
జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే... భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ
భద్రాచలం, జనవరి 23 (ప్రజా మంటలు):
భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ షేక్ ఖాదీర్ను అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో భూ రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది.
ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ వై. రమేష్... మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు
మేడారం, జనవరి 23 (ప్రజా మంటలు):
మేడారంలొ, శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
జంపన్నవాగు–గడ్డెల రోడ్డులోని హరిత ‘వై’ జంక్షన్ వద్ద విద్యుత్ నేమ్ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్న... బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు
నిర్మల్, జనవరి 23 (ప్రజా మంటలు):
తెలంగాణలోని ప్రసిద్ధ విద్యాపీఠమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యాదేవత సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక హోమాలు,... కొండగట్టులో రాజకీయ ఉద్రిక్తత.. అర్చకుల ధర్నాతో స్థంభించిన దర్శనాలు
కొండగట్టు, జనవరి 23 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ అర్చకులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగడంతో భక్తుల దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాదిమంది భక్తులు నిలిచిపోగా, కొందరు భక్తులు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని వెనుదిరిగారు.... ఫోన్ ట్యాపింగ్ కేసు దృష్టి మళ్లింపు కుట్రే : కేటీఆర్
హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు):
ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ దురుద్దేశంతో రూపొందించిన దృష్టి మళ్లింపు కుట్రగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలు వైఫల్యం, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును ముందుకు... జైలులో ప్రేమ.. పెళ్లికి పరోల్ : రాజస్థాన్లో అరుదైన పరిణామం
జైపూర్, జనవరి 23:
రాజస్థాన్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలులో ప్రేమలో పడి, పెళ్లి చేసుకునేందుకు కోర్టు పరోల్ మంజూరు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
హైప్రొఫైల్ దుష్యంత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియ సెత్ (నేహా సెత్) కు... 