ఘనంగా ప్రెస్ క్లబ్ గణేశుని నిమజ్జన శోభాయాత్ర.
- వేలంలో లడ్డు దక్కించుకున్న ఏసీఎన్ ఛానల్ అధినేత అన్వర్ భాయ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) :
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి వద్ద పూజించబడిన లడ్డూ వేలంపాట వైభవంగా ప్రారంభమైంది.
వేలం పాట మొదటిగా జిల్లా సత్యం 3000తో ప్రారంభించగా, తరువాత కోటగిరి వంశీ 3016కి విరాళం అందించారు.
ఏ సి ఎన్ ఛానల్ అధినేత అన్వర్ భాయ్ 4001తో వేలంపాటలో ముందంజలో నిలిచారు.
వేలంపాట ఈ క్రమంలో 6101కి చేరుకుంది. చివరగా ఏసియన్ ఛానల్ అధినేత ఎండి అబ్దుల్ సత్తార్ అన్వర్ 11, 111 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు.
గణపతి లడ్డు వేలంలో లడ్డు దక్కించుకున్న అన్వర్ భాయ్ ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటల తర్వాత ప్రెస్ క్లబ్ నుండి ప్రత్యేక వాహనంపై వినాయకుని అలంకరించి శోభాయాత్రగా పట్టణ ప్రధాన వీధుల గుండా నిమజ్జనం నిర్వహించే చింతకుంటకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేసి గణనాయకునికి నాయకునికి వీడ్కోలు తెలిపారు.
శోభాయాత్రలో ప్రత్యేక దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐదు రోజులపాటు గణేశునికి ప్రత్యేక పూజలు ప్రెస్ క్లబ్ నూతన భవనంలో నిర్వహించి పాత్రికేయులు తమకు సహకరించిన దాతలకు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.