విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

On
విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 11 ( ప్రజా మంటలు) : 

విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. 

బుధవారం రోజున జగిత్యాల మండలం తిప్పన్న పేట గ్రామంలో హెల్త్ క్యాంప్ ను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....

గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారని, డెంగ్యూ పరీక్షలు చేస్తున్నారని ఇప్పటి వరకు డెంగ్యూ జ్వరం బారిన ఎవరు పడలేదని, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అవరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదని కలెక్టర్ రిజిస్టర్ ను చెక్ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో కానీ, నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో, వాటర్ బాటిల్స్, టైర్స్ వంటి వాటిలో దోమలు వృద్ది చెందే అవకాశం ఉందని, అలాగే ఇంటి చుట్టూ పక్కల పరిసరాలలో నీరు నిల్వ ఉన్న స్థలంలో దోమలు ఉండే అవకాశం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతపై అధికారుల బృందాలు అవగాహన కల్పిస్తున్నాయని ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విష జ్వరాల బారిన పడకుండా ఉండాలని కోరారు. 

కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సమీయుద్దీన్, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ముసుగు జైపాల్ రెడ్డి, డిప్యూటీ జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags