బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు - -సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు -
-పేలుడు పదార్థాల లైసెన్సు లు ఇవ్వకండి -
-ప్రభుత్వ విప్ అడ్లూరికి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లకు విజ్ఞప్తి చేసిన బుగ్గారం ప్రజలు
-సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
-ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
-అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
జగిత్యాల / బుగ్గారం/ ధర్మపురి సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బాంబుల గోదాం (పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల) నిలువలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు వేర్వేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసి బాంబుల (డిటోనెటర్ల) గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నిలిపివేయాలని వారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరారు. ప్రాణాంతకమైన ఈ బాంబుల గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు.
ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
బుగ్గారం విడిసి, ఎండీసి ల అధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు, పర్యావరణానికి, వన్య ప్రాణులకు నష్టం కలిగించే పనులు గానీ, ప్రాణ హాని తలపెట్టే పనులు గానీ నియోజక వర్గంలో ఎక్కడా కూడా చేయనీయమని హామీ ఇచ్చారు.
సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా క్షేమమే తన లక్ష్యమని - నియోజక వర్గంలో ఆయా గ్రామాల ప్రజల అభీష్టం మేరకే పనులు చేస్తూ, పాలన కొనసాగిస్తామని అభయ మిచ్చారు.
లక్ష్మణ్ కుమార్ హామీతో బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎండీసి కో - కన్వీనర్ అయిన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేణి రాగన్న, బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటి ఛైర్మన్ మసర్తి నర్సయ్య, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పొలంపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మసర్తి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------
More News...
<%- node_title %>
<%- node_title %>
తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్‌లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రునగర్ లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంబేడ్కర్ అమర్ రహే... కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పూర్తి సందర్భంగా సికింద్రాబాద్‌లో రేపు భారీ సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు)::
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున8 వేడుకలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు అదం సంతోష్ కుమార్ తెలిపారు.డిసెంబర్ 7న సాయంత్రం 4 గంటలకు సీతాఫలమండి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసభ, అభివృద్ధి సమీక్ష, ప్రజలతో సంభాషణ,... డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పురురవ రెడ్డి
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బన్సీలాల్‌పేట్ డివిజన్లోని రెండు ప్రదేశాల్లో ఉన్న ఆయన విగ్రహాలకు బీజేపీ రాష్ట్ర యువనేత మర్రి పురురవ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా దేశానికి... యశోదలో అంతర్జాతీయ యు.బి.ఇ. స్పైన్ కాన్ఫరెన్స్ విజయవంతం
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ (UBE) స్పైన్ సర్జరీలపై రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్‌షాప్ జరిగింది. 500 మందికి పైగా స్పైన్ సర్జన్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రధాన అతిథి పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.స్పోర్ట్స్ ఇంజురీస్, వెన్నెముక?... 