ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి సెప్టెంబర్ 09:
ప్రస్తుత వర్షాకాల పరిస్థితులలో ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వ విప్, డిసిసి అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ...వ్యాధుల బారిన పడిన ప్రజల ఇబ్బందుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో ఆరోపించడాన్ని లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలు తున్న విషయం వాస్తవమని, అయితే జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని ఆసుపత్రులు సందర్శించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మేడారం, పైడిపెల్లి తదితర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించా మన్నారు. అన్ని ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ధర్మపురిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్షల శిబిరం నిర్వహిస్తామన్నారు. ఎ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ సహకారం అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ప్రభుత్వంపై బురద చల్లే ఆలోచన మానుకోవాలన్నారు. కరోనా విజృంభణ సమయంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి హరీష్ రావు, బాధుల చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చ లేదన్నారు. ధర్మపురి ప్రాంత రోగులకు కనీసం అంబులెన్స్ సౌకరం కల్పించే ప్రయత్నం జరగ లేదన్నారు. బెడ్స్ లేక ఆసుపత్రులు నిండుగా ఉంటే నాడు ప్రభుత్వం చేతులు ఎత్తి కూర్చుందన్నారు. ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారే తప్ప, అందుబాటులోకి తేలేదన్నారు. ఇంకా పనులు మిగిలే ఉన్నాయన్నారు. ప్రధాన ఆసుపత్రిలో ఐ సి యూ ప్రారంభం చేయలేదన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలా బాగోగులు చూస్తున్నామని నొక్కి చెప్పారు.
పి సి సి సభ్యులు దినేష్, నాయకులు జక్కు రవి, చిలుముల లక్ష్మణ్, వేముల రాజేశ్, ప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, సి. హెచ్ రాజేశ్, కుంట సుధాకర్, సుముఖ్, నిషాంత్ రెడ్డి, అప్పం శ్రావణ్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు
టెహ్రాన్ జనవరి 11:
నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్వర్క్లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు... వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు.
గోవింద్పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే... మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఆదివారం జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి... జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి... మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు
రాయికల్, జనవరి 12 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలోని ప్రగతి స్కూల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు
జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు)
ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాల నుండి ఓసి జెఏసి సభ్యులు ప్రత్యేక వాహనంలపై తరలి వెళ్లారు
ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న కో కన్వీనర్... ఒకినోవా స్కూల్లో కరాటే బెల్టుల ప్రధానం
జగిత్యాల జనవరి 11 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఒకేనోవా స్కూల్ ఆఫ్ కరాటే స్కూల్లో బెల్టుల ప్రధానం జరిగింది. అంతకుముందు కరాటే శిక్షణార్థులు తమ పర్ఫార్మెన్స్ చూపించారు. అనంతరం బెల్టుల ప్రధానం చేశారు. మాస్టర్ మర్రిపల్లి లింగయ్య, ఇన్స్ట్రక్టర్ తిరుమల నరేష్ కరాటే శిక్షణార్థులు పాల్గొన్నారు. గుండె జబ్బుల నివారణను మిషన్గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణను ఒక మిషన్గా తీసుకొని ప్రభుత్వం, వైద్యులు, సమాజం అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశవ్యాప్తంగా... అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు దా సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్... AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు.
అమిత్ షా ఫోన్ కాల్ తర్వాత మారిన దినకరన్ వ్యూహం!
చెన్నై, జనవరి 11 (ప్రజా మంటలు):
తంజావూరులో జనవరి 5న జరిగిన AMMK జనరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. AMMK ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రసంగం మధ్యలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా... టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
కరీంనగర్, జనవరి 10 (ప్రజా మంటలు):
టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్గా నియమితులైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేయగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
జిల్లా సరిహద్దు బెజ్జంకి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్... ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్ని ప్రమాద బాధితులు
కొండగట్టు జనవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా బొమ్మల వ్యాపారుల దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విద్యుత్ శాఖ తరపున ఆర్థిక సహాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, 