హుజురాబాద్ బస్టాండ్ సమీపంలో గంజాయి పట్టుకున్న హుజరాబాద్ పోలీసులు
ఇద్దరు యువకుల వద్ద నుంచి సుమారు 20 కిలోల గంజాయి స్వాధీనం
హుజురాబాద్ సెప్టెంబర్ 7 ప్రజామంటలు ప్రతినిధి దాసరి కోటేశ్వర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి నిర్మూలనలో భాగంగా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి పట్టుకోవడంలో ఆపరేషన్ నిర్వహించారు. వరంగల్ నుంచి హుజురాబాద్ కి గంజాయిని తీసుకొస్తున్న ఇద్దరు యువకుల్ని పక్క సమాచారం మేరకు హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్సై యునస్ మహమ్మద్ అలీలు తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా వీరి వద్ద నుంచి సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు. దాని విలువ సుమారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కంగిరి జిల్లా వాసులైన అర్జున్ తనుగుల, సుభాష్ సీసా, పక్కపక్క గ్రామస్తులైన వీరిద్దరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలిగా ఉండేవారని అన్నారు. గత ఐదు,ఆరు సంవత్సరాల నుంచి అక్కడ ప్రాంతంలో భూములలో గంజాయి పండిస్తూ మొదట అక్కడే దళారీలకు విక్రయించేవారని అన్నారు. అక్కడ అమ్మితే కేవలం కిలోకి కేవలం 2000 రూపాయలు మాత్రమే వస్తున్నాయని ఆలోచించి, తామే స్వయంగా అమ్మితే కిలోకు 20 వేల వరకు డబ్బులు వస్తాయని ఆలోచనతో గంజాయి అమ్మడం మొదలుపెట్టారని తెలిసిందన్నారు. డబ్బులు తక్కువ వస్తున్నాయని ఆలోచించి అధిక డబ్బులకు విక్రయించాలని ఉద్దేశంతో ఒరిస్సా నుంచి విశాఖపట్నం మీదుగా హుజురాబాద్ చేరుకున్నారని అన్నారు. ఇక్కడ కళాశాలలు ఎక్కువ ఉండడంతో విక్రయిస్తే అధిక మొత్తం వస్తుందని ఆలోచనతో వచ్చారని విచారణలో తేలిందని అన్నారు. గత రెండు నెలల క్రితమే హుజురాబాద్లో సుమారు 60 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ఇందులో చాలామంది యువకులే ఉన్నారని అన్నారు. యువకుల పట్ల తల్లిదండ్రులతోపాటు కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి మత్తులో యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. గంజాయిని పట్టుకున్న సీఐ తిరుమల గౌడ్, ఎస్సై యూనస్ మహమ్మద్ అలీ తోపాటు పోలీస్ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.