ఉపాధ్యాయులు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలి -విధి నిర్వహణ పట్ల అప్రత్తంగా ఉండాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
ఉపాధ్యాయులు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలి -విధి నిర్వహణ పట్ల అప్రత్తంగా ఉండాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఉపాధ్యాయులు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలి -విధి నిర్వహణ పట్ల అప్రత్తంగా ఉండాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు) :

 ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను క్రమ శిక్షణతో పాటు బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థుల అభిరుచి కలిగిన సబ్జెక్టు లపై ఉపాధ్యాయులు తర్ఫీదునిఛ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు.  ఉపాధ్యాయులు విధి నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మంచి నైతిక విలువలు విద్యార్థుల్లో పెంపొందించాలని సూచించారు. 

అనంతరం  జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ముఖ్య అతిథులతో కలిసి మెమెంటో, సర్టిఫికెట్ తో సన్మానించారు.


ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అలువల జ్యోతి, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags