అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య
మనస్తాపం చెంది మరణమే శరణ్యం అనుకున్న తీరు హృదయ విచారకర సంఘటన
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 06: ప్రజామంటలు
చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపం చెంది మల్లమారి రవీందర్(52) అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు మల్లమారి రవీందర్ గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. పొద్దుగూకిన ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కలత చెంది వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వెతికారు. అతని ఆచూకీ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తోటి వ్యవసాయదారులు వంగర పోలీసులకు సమాచారం అందించారు. రవీందర్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వీరి చదువుల నిమిత్తం అప్పులు కాగా పండించిన పంట ఆశించినంత మేర దిగుబడి రాలేదు. దీంతో మనస్థాపం చెందిన రవీందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య కవిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)