గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title
(శ్రీధర గణపతి శర్మ - 9849386786).
జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.
సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.
ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్‌గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్.
అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.
ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.
విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
