హరిహరాలయంలో ఘనంగా ముగిసిన శ్రావణ మాస అభిషేకములు.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణము బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత మాసంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాస అభిషేకములు కొనసాగగా సోమవతి అమావాస్యతో సమాప్తం అయినాయి.
ఈ సందర్భంగా పరమశివునికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అభిషేకం నిర్వహించారు.
అదేవిధంగా సీతారాముల పరివార దేవతలకు నారాయణ ఉపనిషత్తు తో ఆంజనేయస్వామికి మన్యు సూక్తంతో అభిషేకాలు నిర్వహించారు.
గత మాసంగా వైదిక నిర్వహణ చేసిన అన్యారంభట్ల మృత్యుంజయ శర్మను కంకటి సుధాకర్ శర్మను శేష వస్త్రాలతో సత్కరించారు.
శ్రావణ మాసాంతం వరకు ఏక భుక్తం తో దీక్ష కొనసాగించారు.
Tags