ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా - ఫోన్ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంపై వివరించిన రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా - ఫోన్ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంపై వివరించిన రేవంత్
హైదారాబాద్ సెప్టెంబర్ 02 :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ గారు అభినందించారు.
అమిత్ షా ఫోన్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం.. వరదల వల్ల వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
