హరిహరాలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చన
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 30 (ప్రజా మంటలు)
పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మొదట దీపార్చనతో ప్రారంభమై కలశ గణాధిపతి పూజ షోడశ ఉపచార పూజలు నిర్వహించి అమ్మవారి అష్టోత్తరాన్ని సామూహికంగా ఉచ్చరిస్తూ కుంకుమార్చన కొనసాగించారు .అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,వేద ఆశీర్వచనము ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
మాతలు ఒకరికొకరు పసుపు, కుంకుమలు పంపిణీ చేసుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
వైదిక క్రతువును సంఘనభట్ల నరేంద్ర శర్మ నిర్వహించారు.
మాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Tags