సెల్ఫీ దిగుతుండగా కాలుజారి నాగార్జునసాగర్ కాలువలో పడ్డ మహిళ శ్రమించి కాపాడిన స్థానికులు.
On
సెల్ఫీ దిగుతుండగా కాలుజారి నాగార్జునసాగర్ కాలువలో పడ్డ మహిళ శ్రమించి కాపాడిన స్థానికులు.
నల్గొండ ఆగష్టు 30 :
ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది ఓ మహిళ. వెంటనే స్థానికులు స్పందించి ఆ మహిళను శ్రమించి ప్రాణాలతో కాపాడారు.
ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఓ ఫ్యామిలీ సరదగా చుద్దామని.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ తన భర్త, తమ్ముడు, కూతురు తో కలిసి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు మహిళ కాలు జారి కాలువలో పడింది.
వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఆ మహిళను కాపాడారు. ఆమెను కాపాడేందుకు దాదాపుగా 40 నిమిషాల పాటు కష్టపడ్డారు., మహిళను ప్రాణాలతో బయట పడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు. కాగా సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చాలా మంది తమ ప్రాణాలను పోగోట్టుకున్న సంగతి తెలిసిందే.
Tags