ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ
ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ
ధర్మపురి ఆగస్ట్ 30 (ప్రజా మంటలు)
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నందున శుక్రవారం రోజున ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి గైర్హాజరైన వైద్యుల వివరాలు సేకరించి వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇన్ పేషంట్ మరియు ఔట్ పేషెంట్ విభాగాలను పరిశీలించి అడ్మిట్ అయి ఉన్నటువంటి పేషెంట్లను వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల పనితీరు బాగుందా అని వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత డ్రగ్ స్ స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి రిజిస్టర్ ప్రకారం మందులు స్టాక్ నిల్వలు ఉన్నాయా లేవా అని సరిచూశారు. జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులందరూ మరియు సిబ్బంది సమయపాలన పాటించాలని గైర్హాజరైనటువంటి వైద్యులపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సమియుద్దిన్, డిప్యూటీ . జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, ఆర్ ఎం ఓ డాక్టర్ రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
