ఎమ్మెల్సీ కవితకు ఈడి కేసులో బెయిల్ మంజూరు - సీబీఐ కేసులో మంజూరు కావాల్సిన బెయిల్ 

On
ఎమ్మెల్సీ కవితకు ఈడి కేసులో బెయిల్ మంజూరు - సీబీఐ కేసులో మంజూరు కావాల్సిన బెయిల్ 

ఎమ్మెల్సీ కవితకు ఈడి కేసులో బెయిల్ మంజూరు - సీబీఐ కేసులో మంజూరు కావాల్సిన బెయిల్ 

న్యూ ఢిల్లీ ఆగస్టు 27: 

తెరాస నాయకురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇంకా సిబిఐ కేసులో బెయిల్ మంజూరు కానందున ఆమె ఎప్పుడూ బయటకు వస్తారా అని పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విచారణ పూర్తి కావటం,దర్యాప్తు సంస్థలు చార్జ్ షీట్స్ అన్నీ దాఖలు చేయటం, సాక్ష్యుల నుండి సమాచారం కూడా సేకరించిన నేపథ్యంకు తోడు మహిళ అన్న కారణంగా బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.ఎమ్మెల్సీ కవితకు కోర్టు 3 షరతులు పెట్టింది.10లక్షల రూపాయల పూచీకత్తు,సాక్ష్యులను ప్రభావితం చేయకూడదు,పాస్ పోర్టును సబ్మిట్ చేయాలి అనే కండిషన్ పెట్టింది కోర్టు.

సీబీఐ కేసులో సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది.

Tags