స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమములో ప్రజలంతా భాగస్వాములు కావాలి
ముత్తారం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మాలతి రెడ్డి
పోచమ్మ దేవాలయం ముందు గడ్డి తొలగింపు
భీమదేవరపల్లి ఆగస్టు 6 (ప్రజామంటలు) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం - పరిశుభ్రత విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మాలతి రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో మంగళవారం గ్రామస్తుల సహకారంతో గ్రామంలోని పోచమ్మ దేవాలయం ముందు ఉన్న గడ్డిని తొలగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి డాక్టర్ మాలతి రెడ్డి మాట్లాడుతూ, ఐదు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించేందుకు అందరి కృషి ఉండాలని అన్నారు. మొక్కలు లేని ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊరడి జయపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, దేవరాజు శంకర్, ఏనుగు కోటేశ్వర్ రెడ్డి, రేనికుంట్ల ఎదాస్, పోగుల ప్రసాద్, కాశిరెడ్డి రాంరెడ్డి, నద్దునూరి చొక్కయ్య, మోకిడి భరత్, పంచాయతీ సిబ్బంది రేనికుంట్ల ఫిలిప్, ఒల్లాల కొమురయ్య, వీరమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.