అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రావణ మాస అభిషేకములు.
On
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల ఆగస్ట్ 5 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా నిర్వహించ బడుచున్నట్లే సోమవారం నుండి శ్రావణమాస అభిషేకములు ఉదయాత్ పూర్వమే ప్రారంభమైనాయి.
ఈ సందర్భంగా తొలుత విగ్నేశ్వరుని పూజ, నారాయణ ఉపనిషత్తు, మన్యూ సూక్తం, రుద్ర నమక చమకము పురుష, శ్రీ సూక్తములతో అభిషేకములు నిర్వహించినారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు .విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనము చేశారు.
మంగళహారతి మంత్రపుష్పం, భజనలతో కార్యక్రమాన్ని కొన సాగించారు.
స్వామి వారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది.
వైదిక క్రతువును అన్యారంభట్ల మృత్యుంజయం శర్మ ,శ్రీధర గణపతి శర్మ, రావుల రాజేశ్వర్ శర్మ, సిరిసిల్ల. శ్రీనివాస్ శర్మ లు నిర్వహించారు.
Tags