నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
- ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
జగిత్యాల ఆగస్టు 3 (ప్రజా మంటలు) :
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణం లోని టవర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసన కార్యక్రమoలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలను డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ షాప్ ఓనర్స్, స్థానిక వ్యాపారులతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని,నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు.సిసి కెమెరాల ద్వారా సేకరించిన సాక్ష్యాల ద్వారా నేరస్థుడు పాల్పడిన నేరాన్ని కోర్టు నిరూపించ వచ్చని అన్నారు. ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. సీసీ కెమెరాలను ప్రధాన రోడ్డు మార్గాల్లో ఎర్పాటు చేయడం ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తగు సమీక్షా జరిపి రోడ్డు ప్రమాదాల నివాణకు తగిన జాగ్రత్త లో తీసుకోవచ్చు అన్నారు. జిల్లా ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు లో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహాయ సహకారాలు అందించిన డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ షాప్ ఓనర్స్, మరియు వ్యాపారులను జిల్లా ఎస్పీ సన్మానించి అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
